ఫ‌ల‌క్‌నుమా దాస్‌ మూవీ రివ్యూ

నటీనటులు : విశ్వ‌క్ సేన్, త‌రుణ్ భాస్క‌ర్, హర్షిత గౌర్ , సలోని త‌దిత‌రులు..
బ్యానర్: విశ్వ‌క్ సేన్ సినిమాస్- టెర్రానోవా పిక్చ‌ర్స్-వ‌న్మాయే క్రియేష‌న్స్‌
నిర్మాత: విశ్వ‌క్ సేన్
సంగీతం: వివేక్ సాగ‌ర్
దర్శకత్వం: విశ్వ‌క్ సేన్

ముందు మాట:
ఫ‌ల‌క్‌నుమా దాస్ .. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్- టీజ‌ర్- ట్రైల‌ర్ ప‌బ్లిక్ లోకి దూసుకెళ్లిపోయాయి. ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టించిన విశ్వ‌క్ సేన్ (ఈ న‌గ‌రానికి ఏమైంది ఫేం) హైద‌రాబాదీ యాస.. భాష‌.. లుక్ అన్నీ యూత్ కి న‌చ్చాయి. ఒక ర‌ఫ్ అండ్ ర‌గ్గ్ డ్ రోల్ లో అత‌డి ఆహార్యం ట్రైల‌ర్ లో అందిరికీ న‌చ్చింది. ఆ క్ర‌మంలోనే దాసు ఏదో మ్యాజిక్ చేసేట్టున్నాడు అన్న పాజిటివ్ టాక్ వినిపించింది. విశ్వ‌క్ సేన్ న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాపై అంతో ఇంతో అంచ‌నాలు ఏర్పడ్డాయి. ఓ ర‌కంగా ఇది విశ్వ‌క్ సేన్ త‌న సొంత బ‌యోపిక్ అని చెప్పుకున్నాడు కాబ‌ట్టి ఎంతో ఎమోష‌న‌ల్ గా తీసి ఉంటాడ‌ని అర్థ‌మైంది. మ‌ల‌యాళీ రీమేక్ అయినా అత‌డు హైద‌రాబాదీ యాస‌- క‌ల్చ‌ర్ ని తెర‌పైకి తేవ‌డంలో ఎంత‌వ‌ర‌కూ స‌ఫ‌లీకృతం అయ్యాడు? అన్న క్యూరియాసిటీ పెరిగింది. అస‌లు దాస్ మీద పెట్టుకున్న అంచ‌నాల్ని అత‌డు రీచ్ అయ్యాడా లేదా? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూ చ‌ద‌వాల్సిందే.

కథనం అనాలిసిస్:
హైద‌రాబాద్ ఫ‌ల‌క్‌నుమా ఏరియాలో దందాలు చేసే దాస్ జీవితంలో సంఘ‌ట‌న స‌మాహార‌మే ఈ చిత్రం. ఫలక్ నుమా ఏరియాలో పుట్టి పెరిగిన దాస్ (విశ్వక్‌ సేన్‌) అదే ఏరియాలోని శంకరన్న అనే గ్యాంగ్ స్ట‌ర్ ని చూసి స్ఫూర్తి పొంది అత‌డిలా ఎద‌గాల‌ని అనుకుంటాడు. త‌న‌కంటూ ఓ గ్యాంగ్ ని త‌యారు చేయాల‌ని అనుకుంటాడు. ఆ క్ర‌మంలోనే శంక‌ర‌న్న హ‌త్య అనంత‌రం దాస్ ఓ హ‌త్య కేసులో చిక్కుకోవ‌డంతో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. జీవితంలో ఊహించ‌ని సంఘ‌ట‌న‌ల నుంచి దాస్ చివ‌రికి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? చివ‌రికి దాస్ గ్యాంగ్ ఎలా సెటిల‌య్యారు? దాస్ జీవితంలో ప్రేమక‌థ‌లేంటి? అన్న‌దే సినిమా.

ఇది ఓ రీమేక్ సినిమా అన్న భావ‌న క‌ల‌గ‌కుండా తెలుగైజ్ చేయ‌డంలో విశ్వ‌క్ కొంత స‌ఫ‌ల‌మైనా సంపూర్ణంగా గ్రిప్ తెచ్చుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడ‌నే చెప్పాలి. ముఖ్యంగా స్క్రీన్ ప్లేని తీర్చిదిద్దిన విధానం.. స్టో నేరేష‌న్ థియేట‌ర్ల‌లో ఆడియెన్ కి ఏదో మిస్స‌య్యింద‌న్న నెగెటివ్ ఫీల్ ని క‌లిగిస్తుంది. హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ నేప‌థ్యం సినిమాకి ప్ల‌స్. సినిమాలో ఫ‌ల‌క్ నుమా స్ల‌మ్స్.. హైద‌రాబాద్ యాస‌.. స్నేహాలు.. ప్రేమ‌క‌థ‌లు.. క‌ల్చ‌ర్ ప్ర‌తిదీ చ‌క్క‌గా చూపించాడు. అయితే కొన్ని ల్యాగ్ సీన్స్ క‌థ‌నంలో గ్రిప్ చూపించ‌డంలో విఫ‌ల‌మ‌వ్వ‌డం ఇబ్బంది క‌లిగిస్తుంది.

నటీనటుల ప్ర‌ద‌ర్శ‌న‌:

ఈ చిత్రంలో నటన ప‌రంగా ప‌రిశీలిస్తే.. విశ్వ‌క్ సేన్ ప్ర‌ధాన బ‌లం. అత‌డి న‌ట‌న‌- యాస‌- భాష హైలైట్. అలాగే ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. నాని అన్న‌ట్టే అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌దిలేసి న‌టుడిగా సెటిలైపోవ‌చ్చు అనేంత‌గా న‌టించాడు క‌థానాయిక‌లు హర్షిత గౌర్ , సలోని గ్లామ‌ర్ ఓకే అయినా న‌ట‌న భ‌య‌పెడుతుంది. ఉత్తేజ్ న‌ట‌న ఓకే. ర‌వి పాత్ర ఆక‌ట్టుకుంది.

విశ్వక్‌ సేన్‌ కథ, పాత్రల పరంగా మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథను మొదలు పెట్టడంలో ప‌రిగెత్తించ‌డంలో మాత్రం స్టో నేరేష‌న్ ఇబ్బందిక‌రం. పాత్రలు పరిచయానికి చాలా సమయం తీసుకున్నారనుకున్నారు. పైగా సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఇక రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను ఈ చిత్రం ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

టెక్నికాలిటీస్:
అంగ‌మ‌లై డైరీస్ చిత్రాన్ని రీమేక్ చేసిన విశ్వ‌క్ ఎంచుకున్న బ్యాక్ గ్రౌండ్ బావున్నా.. ఆశించిన స్థాయిలో మ‌ల‌చ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ప‌రంగా మ్యాజిక్ చేయలేక‌పోయాడు. వివేక్ సాగ‌ర్ నేప‌థ్య సంగీతం సోసోగానే నిలిచింది. ఇక కెమెరా వ‌ర్క్ కొన్నిచోట్ల అద్భుతం. చాలా చోట్ల ఆక‌ట్టుకోలేదు. నిర్మాణ విలువ‌లు ఓకే.

ప్లస్ పాయింట్స్ :
* ప్ర‌థ‌మార్థం కామెడీ సీన్స్
* ఫ‌ల‌క్ నుమా బ్యాక్ గ్రౌండ్
* ర‌ఫ్ పెర్ఫామెన్సెస్ .. డైలాగ్స్
* బీ- సీ సెంట‌ర్స్ టార్గెట్ చేసిన థీమ్

మైనస్ పాయింట్స్ :

* వీక్ స్క్రీన్ ప్లే
* సెకండాఫ్ స్లో ఫేస్
* రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ జీరో
* ప‌తాక స‌న్నివేశాల సాగ‌తీత

ముగింపు:
బోరింగ్ దాసూ.. ఏంటిలా చేశావ్‌?

రేటింగ్: 2.0/5

Also Read : Falaknuma Das Review