స్టార్ హీరోకి విగ్రహం ఏర్పాటు చేస్తోన్న ఫ్యాన్స్

Fans build life sized statue star hero Ajith Kumar

సౌత్ సినిమా హీరోలపై ఫ్యాన్స్ చూపించే అభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ స్టార్ హీరోల అభిమానులైతే తమ ప్రేమతో పిచ్చెక్కిస్తూ ఉంటారు. అదే కోలీవుడ్ లో అయితే, అంతకుమించి అనేలా పోటాపోటీగా తమ అభిమాన స్టార్ హీరో కోసం ఏమైనా చేసేస్తారు. ఇక ఆయా హీరోల కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు.. ఫ్యాన్స్ చేసే హంగామా, హీరో పేరిట చేసే పలు సామాజిక కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉంటాయి. ఇప్పుడు అదే తరహాలో తమిళనాడులో బడా స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ కుమార్ కు ఆయన అభిమానులు ఏకంగా విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారట. మామూలుగానే తమిళనాట భారీ ఫాలోయింగ్ తో మాస్ హీరోగా తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకున్న అజిత్ కు ఉన్న క్రేజ్ గురించి మాటల్లో చెప్పలేం.
ముఖ్యంగా తమిళనాడులో రజినీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ తో పాటు జనాలను ప్రభావితం చేయగల వ్యక్తిగా అజిత్ కు మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో అజిత్ సినిమా వస్తుందంటే చాలు అక్కడ చాలామందికి పూనకాలు వచ్చేస్తాయి. ఈ క్రమంలోనే అజిత్ లేటెస్ట్ మూవీ ‘వివేగమ్’ రిలీజ్ కు రెడీ అవుతుండటంతో.. ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. అందులో భాగంగానే రీసెంట్ రిలీజైన వివేగమ్ టీజర్ అదిరిపోయేలా ఉండటంతో దానికి గంటల వ్యవధిలోనే రికార్డు వ్యూస్ తెప్పించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడేమో ఆ టీజర్ లో అజిత్ స్టైల్ గా నడిచి వచ్చే సీన్ కి ఫిదా అయిపోయిన ఫ్యాన్స్.. దానినే ఫాలో అయిపోతూ అజిత్ వాకింగ్ స్టైల్ లోనే ఆయన నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేసేస్తున్నారు. ఇక ఈ విగ్రహాన్ని ‘వివేగమ్’ మూవీ రిలీజ్ టైమ్ లో ఆవిష్కరించనున్నట్లు కోలీవుడ్ తాజా సమాచారం. మరి ఈ రేంజ్ లో రచ్చ జరుగుతున్న తరుణంలో అజిత్ ‘వివేగమ్’ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.