ఎన్టీఆర్‌ని ఇంటికెళ్లి షంటుడేందో?

Last Updated on by

ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో మార్పు ఎంతో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌న హీరోల ప‌రిణ‌తి .. ఫ్యామిలీ కైండ్ యాటిట్యూడ్ పై ఆస‌క్తి రేకెత్తిస్తోంది. మ‌న హీరోలు ప‌క్కాగా ఫ్యామిలీ మ్యాన్‌లుగా మారిపోయారు. షూటింగులు అయిపోయాక‌, ఇంటికొస్తే కిడ్స్‌తో ఆడుకోవ‌డాలు.. ఫ్యామిలీతో ఊరూ వాడా షికార్లు వెళ్ల‌డాలు క‌నిపిస్తోంది. ఇక మ‌హేష్ అయితే న‌మ్ర‌త‌తో క‌లిసి విదేశాల‌కు వెళ్ల‌డ‌మే కాదు.. మ‌ట్టి వాస‌న గుమ్మ‌రించే త‌న సొంత ఊరికే వెళ్లి వ‌స్తున్నారు. అక్కడ పొలంలో గౌత‌మ్‌, సితార‌ల‌తో న‌మ్ర‌త కిడ్స్‌ ఆట‌లాడుకుంటున్నారు. అదంతా అటుంచితే ఇంకా తీరిక చిక్కితే మ‌న స్టార్లు అభిమానుల‌ను పిలిచి మ‌రీ ఫోటోలు దిగుతున్నారు. ఇదో కొత్త ట్రెండ్‌.

ఇదివ‌ర‌కూ మహేష్‌, చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్ .. ఈ త‌ర‌హాలో ఇళ్ల ద‌గ్గ‌ర అభిమానుల‌తో ఫోటోలు దిగారు. ఆన్ లొకేష‌న్ వీలున్న‌ప్పుడు ఫోటోలు దిగుతున్నారు. ఇది ఇప్పుడే కొత్త కాదు కానీ, ఇప్పుడు ఈ ప్ర‌క్రియ మ‌రింత డ‌బుల్ అయ్యింది. ఇక ఇదిగో ఇక్క‌డ తార‌క్‌ని చూస్తే సీన్ మొత్తం అర్థ‌మైపోతోంది. గ‌త కొంత‌కాలంగా తార‌క్ ఇంటి చుట్టూ ఇలా అభిమానులు బొంగ‌రం తిరుగుతున్నారు. నిన్న‌టిరోజున న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నంద‌మూరి అభిమానులు జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ ప‌క్క‌నే ఉన్న ఇంటిని చుట్టుముట్టారు. ప‌నిలో ప‌నిగా అట్నుంచి నేరుగా తార‌క్ ఇంటికెళ్లి ఫ్యాన్స్ ఇలా చుట్టుముట్ట‌డం చ‌ర్చ‌కొచ్చింది. తార‌క్‌కి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని వీర ఫ్యాన్స్ .. ఇంటికెళ్లి మ‌రీ సెల్ఫీలు దిగేందుకు ట్రై చేశారు. అయితే ఈ తోపులాట‌ల్ని తార‌క్ వారించే ప్ర‌య‌త్నం చేశాడుట‌. అయితే స్టార్ హీరోలు అయినా ఇదేం గోల‌రా బాబోయ్ అన‌కుండా ఇలా అభిమానుల‌తో ఫోటోలు దిగ‌డం హ‌ర్ష‌నీయం. తార‌క్‌లో స‌హ‌నం ఇప్పుడు అభిమానుల‌కు ఎంతో ఉప‌కారంగా ఉందిట‌. అమితాబ్‌, చిరు బాట‌లో తార‌క్ వెళుతున్నాడంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. జ‌మానా కాలంలో బిగ్‌బి అమితాబ్ ఈ త‌ర‌హా ట్రెండ్ స్టార్ట్ చేశాడు. ఇప్ప‌టికీ దానినే అత‌డు ఫాలో అవుతున్నాడు. వారానికోరోజు అభిమానుల‌కు కేటాయిస్తున్నాడు. అదే బాట‌లో చిరంజీవి వెళ్లారు. ఇప్పుడు ఏకంగా … కుర్ర‌హీరోలు ఫాలో అయిపోతున్నారంతే.

User Comments