పిక్‌టాక్‌: ప‌డి ప‌డి లేచే ప‌రువం

Last Updated on by

సినీప‌రిశ్ర‌మ‌లో ఎప్పుడు ఎవ‌రికి ఎలాంటి అవ‌కాశాలు వ‌స్తాయో చెప్ప‌లేం. ఒక్కోసారి గ్లామ‌ర్ న‌డిపిస్తుంది. ఎక్కువసార్లు గ్రామ‌ర్‌, బాడీ లాంగ్వేజ్ న‌డిపించేందుకు ఆస్కారం ఉంది. ఈ రెండో కేట‌గిరీలో నిరూపించుకున్న న‌టి సాయి ప‌ల్ల‌వి. గ్లామ‌ర్ కంటే గ్రామ‌ర్‌ని, న‌ట‌న‌ను న‌మ్ముకుని ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతోంది. ఇప్ప‌టికిప్పుడు స్టార్ హీరోయిన్ల‌కే ద‌క్క‌ని లేడీ ఓరియెంటెడ్ క‌థాంశాల్లో న‌టించేస్తోంది ఈ భామ‌. ఇదెలా సాధ్య‌మైంది అంటే అందుకు ఫౌండేష‌న్ ప్రేమ‌మ్‌, ఫిదా.

ఆ రెండు చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది సాయి ప‌ల్ల‌వి. కెరీర్‌ ఆరంభ‌మే చ‌క్క‌ని న‌టి అన్న పేరొచ్చింది. అటుపై కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసిందే లేదు. వ‌రుస‌గా క్రేజీ బ్యాన‌ర్ల‌లో అవ‌కాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇటీవ‌లే రిలీజైన ద్విభాషా చిత్రం `క‌ణం` తెలుగు, త‌మిళ్ రెండుచోట్లా ఫెయిలైనా సాయిప‌ల్ల‌వి మాత్రం ఫెయిల్ కాలేద‌న్న టాక్ త‌న‌కు ప్ల‌స్ అయ్యింది. ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌వి- శర్వానంద్‌ జంటగా ‘పడి పడి లేచే మనసు’ చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. హను రాఘవపూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ ం వ‌హిస్తున్నారు. ‘అందాల రాక్షసి’ లాంటి మంచి ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరిని తెరకెక్కించిన హను… ఈ సినిమాను కూడా అదే జోన‌ర్‌లో తెరకెక్కిస్తున్నార‌ని తెలుస్తోంది. సాయి పల్లవి పుట్టినరోజు కానుకగా `పడి పడి లేచె మనసు` లుక్‌ను రిలీజ్‌ చేశారు. సాయిపల్ల‌వి బ్రాండ్ అల్ల‌రి, చిలిపిత‌నం ఈ పోస్ట‌ర్‌లో ఎలివేట్ అయ్యింది. అమ్మోరులా ఆ ముక్కుకు తీరైన‌ ముక్కెర‌, చెవికి జూకాలు.. కంచి ప‌ట్టు చీర‌లో.. చెంప‌ల‌పై సింధూరంతో ఈ భామ ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తోంది. ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించ‌గా, ప్రసాద్‌ చుక్కపల్లి, సుధాకర్‌ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయిప‌ల్ల‌వి గ్రామ‌ర్‌..గ్లామ‌ర‌స్ నాయిక‌లు ఇవ్వ‌లేని ఎన్నిటినో ఇస్తోంది కాబ‌ట్టే ఆడియెన్ థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. ఆ సంగ‌తి ఈ చిత్రంతోనూ నిరూప‌ణ అవుతుందేమో చూడాలి.

User Comments