ఈ యేడాది అత్యంతం ఆసక్తికరమైన కలయికలో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫైటర్ ఒకటి. `ఇస్మార్ట్ శంకర్` తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. పూరి సినిమాల్లో హీరోలే వేరు. చాలా పవర్‌ఫుల్‌గా ఎవరినీ లెక్కచేయని మనస్తత్వంతో కనిపిస్తుంటారు. నిజ జీవితంలో అచ్చం అలా ఉండే కథానాయకుడు విజయ్ దేవరకొండ. అందుకే ఆయనకి రౌడీ అనే పేరుంది. అలాంటి విజయ్‌తో పూరి సినిమా అనగానే అందరిలోనూ ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ఈ రోజే ఆ సినిమాని ముంబైలో మొదలుపెట్టారు. ఛార్మి తొలి షాట్‌కి క్లాప్ కొట్టారు. యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది. ఇందులో విజయ్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. ఇందులో బాలీవుడ్ భామ అనన్య పాండే కథానాయికగా నటిస్తున్నట్టు తెలుస్తోంది.