సినీకార్మికులు త‌న్నుకు చ‌చ్చే ప్లాన్

Last Updated on by

గ‌త కొంత‌కాలంగా సినీకార్మికుల జీత‌భ‌త్యాల పెంపు స‌మ‌స్య‌ గురించిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. కార్మికుల జీతాలు పెంచాలా?  వ‌ద్దా? అన్న‌దానిపై ఫిలింఛాంబ‌ర్ పెద్ద‌లు, నిర్మాత‌లంతా మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఆ క్ర‌మంలోనే లైట్‌మెన్ మెరుపు స‌మ్మెకు దిగ‌డంతో పెద్దలు దిగి రావాల్సి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఫిలించాంబ‌ర్‌, నిర్మాత‌ల‌తో ఫెడ‌రేష‌న్ చ‌ర్చ‌లు ఫ‌ల‌వంతం అయ్యాయ‌ని అడ్‌హ‌క్ క‌మిటీ మెంబ‌ర్, సీనియ‌ర్‌ నిర్మాత మోహ‌న్ గౌడ్ ప్ర‌క‌టించారు. అయితే ఈ పెంపు కేవ‌లం పెద్ద సినిమాల వ‌ర‌కే. చిన్న సినిమాల ప‌రిమిత బ‌డ్జెట్ దృష్ట్యా పెంపు ఉండ‌దని తెలిపారు. అయితే ప‌రిశ్ర‌మ జాగ్ర‌త్త ప‌డాల్సిన టైమ్ ఇదే. పెంచిన భ‌త్య ం మాకు ఇవ్వ‌లేదు అంటూ కార్మికుల గొడ‌వ‌లు స్టార్ట్ చేశారు.
మ‌న‌కు ఉన్న స‌మ‌స్య‌ల్లో ఒక పెద్ద స‌మ‌స్య‌. జీత‌భ‌త్యాలు పెంచ‌క‌పోవ‌డం .. అయితే తాజా పెంపుతో చిన్న సినిమాలు చేసే నిర్మాత‌లు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. కార్మికులు వ‌చ్చి పెంచిన భ‌త్య‌మే ఇవ్వాలి అని డిమాండ్ చేసినా భ‌యప‌డొద్దు. కొత్త‌గా సినిమాలు తీసేవాళ్లు లోబ‌డ్జెట్ సినిమా అని ఎలా నిర్ణ‌యిస్తారు? అంటే.. ఛాంబ‌ర్‌కు తెలియ‌జేస్తే అక్క‌డ పెద్ద‌లు దానిని నిర్ణ‌యిస్తారు. ఆ త‌ర‌వాత ధైర్య ంగా సినిమా చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లొచ్చు. చిన్న బ‌డ్జెట్ సినిమాల‌కు ఇప్ప‌టికే ఉన్న పాత రేట్లే వ‌ర్తిస్తాయి. కొత్త రేట్లు వ‌ర్తించ‌వు. ఒక‌వేళ ప‌నికి వ‌చ్చిన కార్మికులు భ‌త్య ంపై ప్ర‌శ్నిస్తే, అగ్రిమెంట్ తీసుకురండి.. లేదా ఫిలింఛాంబ‌ర్‌కు ఫోన్ చేయండి.. అక్క‌డ పెంచిన‌ట్ట‌యితే మేం అది ఇస్తామ‌ని మేక‌ర్స్ చెప్ప ండి. ఇండ‌స్ట్రీలో టెక్నీషియ‌న్లు దొరికినంతా దోచేయాల‌నుకుంటారు. దీనివ‌ల్ల చిన్న సినిమాలు తీసే నిర్మాత‌లు చాలా ఇబ్బందులు ప‌డ‌తారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఛాంబ‌ర్‌కు ఫోన్ చేయండి. అక్క‌డ స్పందించ‌కోతే నాకు ఫోన్ చేయండి అని ఏపీ ఫిలింఛాంబ‌ర్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మోహ‌న్‌గౌడ్ తెలిపారు.

User Comments