లోక్‌స‌భ స‌మ‌రంలో సినీ తార‌లు

Last Updated on by

గ‌తంతో పోలిస్తే ఈ ఎన్నిక‌ల్లో సినీతార‌ల సంద‌డి ఎక్కువైంది. గ‌తంలో కొంత మంది తార‌లు మాత్ర‌మే ఎన్నిక‌ల‌పై, ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌పై ఆస‌క్తిని క‌న‌బ‌రిస్తే ఈ దఫా మాత్రం చాలా మంది ప్ర‌ముఖన‌టీన‌లు ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి త‌మ స‌త్తా ఏంటో చాటాలని ముందుకు రావ‌డం ఈ ఎన్నిక‌ల ప్ర‌త్యేక‌త‌. ఓ ప‌క్క బీజేపీ మ‌ళ్లీ అధికారం లోకి రావాల‌ని పావులు క‌దుపుతూ వుంటే..బీజేపీ లోపాల్సి అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ దాని మిత్ర‌ప‌క్షాలు అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ హోరా హోరీ పోరులో సినీ స్టార్స్ స‌మ‌రం ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

ఈ ద‌ఫా లోక్‌స‌భ‌తో పాటు శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో కొత్త ముఖాలు పోటీకి దిగ‌డం గ‌మ‌నార్హం. ఇక కొంత మంది స్టార్లు పోటీకి దిగుతుంటే వారికి మ‌రికొంత మంది సినీ తార‌లు స‌పోర్ట్‌గా నిలుస్తూ ప్ర‌చారానికి రాబోతున్నారు. తెలుగులో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పార్టీని స్థాపించి తొలిసారి ఎన్నిక‌ల‌కు వెళుతున్నారు. ఆ త‌రువాత పార్టీ పెట్టిన క‌మ‌ల్‌హాస‌న్ కూడా ఈ ఎన్నిక‌ల్లో తన క్రేజ్ రాజ‌కీయాల్లో ఎంత వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుందో తేల్చుకోబోతున్నారు. అంబారీష్ మ‌ర‌ణం త‌రువాత ఖాలీ అయిన మాండ్యా నుంచి నుంచి సుమ‌ల‌త బ‌రిలోకి దిగుతోంది. ఆమెకు పోటీగా క‌న్న‌డ న‌టుడు నిఖ‌ల్ గౌడ పోటీప‌డుతున్నాడు. అయితే సుమ‌ల‌త‌కు మాత్రం `కేజీఎఫ్‌` హీరో య‌ష్‌, మ‌రో హీరో ద‌ర్శ‌న్, చిరంజీవి, ర‌జ‌నీకాంత్‌ అండ‌గా నిలుస్తున్నారు. ఇక బెంళూరు సెంట్ర‌ల్ నుంచి ప్ర‌కాష్‌రాజ్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీప‌డుతున్నారు. క‌న్న‌డ విల‌క్ష‌ణ న‌టుడు ఉపేంద్ర ప్ర‌జాకీయ పార్టీ పేరుతో లోక్‌స‌భ‌కు పోటీప‌డుతున్నాడు. మెద‌క్ ఎంపీగా విజ‌య‌శాంతి, ఏపీ ఎన్నిక‌ల్లో న‌గ‌రి నుంచి శాస‌న స‌భ్యురాలిగా రోజా, హిందూపురం శాస‌న స‌భ్యుడిగా బాల‌కృష్ణ‌, వైసీపీ నుంచి జ‌య‌సుధ‌, అలీ, దాసరి అరుణ్‌కుమార్‌, రాజా ర‌వీంద్ర‌, కేర‌ళ బీజేపీ త‌ర‌పున ఎంపీగా సురేష్ గోపీ పోటీకి దిగుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

User Comments