ఫిలింఫేర్ 2018 ఉత్త‌మ న‌టుడు?

జూన్ 16న హైద‌రాబాద్‌లో 65వ ఫిలింఫేర్‌ ఉత్స‌వాలు హైద‌రాబాద్ నోవాటెల్‌లో అత్యంత వైభ‌వంగా జ‌ర‌గ‌నున్నాయి. తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డలో 2017 రిలీజ్‌ సినిమాల‌కు ఈ అవార్డుల్ని అందించ‌నున్నారు. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ క‌థానాయ‌కుడు, ఉత్త‌మ క‌థానాయిక కేటగిరీలు స‌హా ప‌లు కీల‌క విభాగాల్లో ప్ర‌తిభ‌కు పుర‌స్కారాల్ని అందించ‌నున్నారు. ఉత్త‌మ సినిమా కేట‌గిరీలో అర్జున్‌రెడ్డి, బాహుబ‌లి 2, ఫిదా, గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి, శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాలు పోటీప‌డుతున్నాయి. ఉత్త‌మ క‌థానాయ‌కుడు కేటగిరీలో మెగాస్టార్ చిరంజీవి(ఖైద‌నంబ‌ర్ 150), న‌ట‌సింహా బాల‌కృష్ణ (గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి), యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌(జై ల‌వ‌కుశ‌), ప్ర‌భాస్‌(బాహుబ‌లి2), వెంక‌టేష్ (గురు), విజ‌య్ దేవ‌ర‌కొండ (అర్జున్‌రెడ్డి) త‌దిత‌రులు పోటీప‌డుతున్నారు. ఉత్త‌మ ద‌ర్శ‌కుడు కేటగిరీలో క్రిష్‌(గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి), ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి(బాహుబ‌లి 2), సందీప్‌రెడ్డి వంగా(అర్జున్‌రెడ్డి), సంక‌ల్ప్ రెడ్డి (ఘాజి), స‌తీష్ వేగేష్న‌(శ‌త‌మానం భ‌వ‌తి), శేఖ‌ర్ క‌మ్ముల (ఫిదా) పోటీలో నిలిచారు.

ఉత్త‌మ క‌థానాయిక కేట‌గిరీలో అనుష్క శెట్టి (బాహుబ‌లి 2), నివేధ థామ‌స్ (నిన్ను కోరి), ర‌కుల్ ప్రీత్ సింగ్ (రారండోయ్ వేడుక చూద్దాం), రితిక సింగ్ (గురు), సాయి ప‌ల్ల‌వి (ఫిదా) …. పోటీప‌డుతున్నారు. ఉత్తమ స‌హాయ‌న‌టి కేట‌గిరీలో భూమిక (ఎంసిఏ), కేథ‌రిన్ థ్రెసా (నేనే రాజు నేనే మంత్రి), జ‌య‌సుధ (శ‌త‌మానం భ‌వ‌తి), ర‌మ్య‌కృష్ణ (బాహుబ‌లి -2), శ‌ర‌ణ్య ప్ర‌దీప్ (ఫిదా) .. పోటీ ప‌డుతున్నారు. ఖైదీనంబ‌ర్ 150, బాహుబ‌లి2, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, అర్జున్‌రెడ్డి చిత్రాలు ప్ర‌ధాన విభాగాల్లో పోటీప‌డుతుండ‌డం విశేషం. చిరంజీవి, ఎన్టీఆర్‌, బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. వీళ్ల‌లో ఎవ‌రు ఉత్త‌మ న‌టుడు? అంటే కాస్త ఠ‌ఫ్ కాంపిటీష‌న్ అనే చెప్పొచ్చు.