మొత్తానికి మారాన‌ని ఒప్పుకున్న హ‌రీష్‌

టాలీవుడ్ మాస్ డైరెక్ట‌ర్ గా హ‌రీష్ శంక‌ర్ ప్ర‌తిభ గురించి తెలిసిందే. మ‌ధ్య‌లో కొన్ని ప‌రాజ‌యాలు అత‌డిని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఎట్ట‌కేల‌కు వాల్మీకి అలియాస్ గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ చిత్రంతో దారికొచ్చాడు. ఈ సినిమా స‌క్సెస్ వేదిక‌పై తాను మారానని అంగీక‌రించ‌డం ఓ ట్విస్టు. వైజాగ్ స‌క్సెస్ మీట్ లో హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ – “మ‌రో ఆరు గంటల్లో సినిమా రిలీజ్‌ పెట్టుకొని టైటిల్‌ మార్చినా అందరూ హీరోల ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. ఈ వేదిక మీదినుండి అందరి హీరోలకి, వారి ఫ్యాన్స్ కి మనస్ఫూర్తిగా థాంక్స్ చెపుతున్నాను. ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్. నేను ఒక స్క్రిప్ట్ అనుకోని ఇద్దరు హీరోలతో ఒక సినిమా చేద్దాం అని బయలుదేరినప్పుడు ఒక థాట్ కి వరుణ్ సీడ్ వేశారు. ఆ థాట్ నా సినిమా మేకింగ్ స్టైల్ ని మార్చింది. ఫస్ట్ టైమ్ రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా నేనో సినిమా తీశాను. నేను సినిమా చేస్తున్నంత సేపు నన్ను నమ్మి చేసినందుకు వరుణ్ కి మరో సారి థాంక్స్. ఒక్కసారి గద్దల కొండ గణేష్ గెటప్ లో వరుణ్ కెమెరా ముందుకు రాగానే నాకు చాలా ఎనర్జీ వచ్చింది. వరుణ్ తన డెడికేషన్, హార్డ్ వర్క్ తో సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. జిగర్తాండ‌ను వరుణ్‌తో చేస్తున్నాం..అన్నప్పుడు వరుణ్‌ ఏ క్యారెక్టర్‌ చేస్తాడు అని కూడా అడగకుండా వెంటనే రైట్స్‌ తీసుకున్నారు. నేనంటే వాళ్లకు అంత నమ్మకం. ఈ 14 రీల్స్‌ప్లస్‌ బేనర్‌ నా సినిమాతో స్టార్ట్‌ అవడం సంతోషంగా ఉంది. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం గబ్బర్ సింగ్ ఫంక్షన్ ఇక్కడే జరిగింది. ఇన్ని రోజుల తర్వాత ఈ సక్సెస్ ఫంక్షన్ జరగడం హ్యాపీగా ఉంది.  పవర్ స్టార్ వచ్చే వారంలో ఈ సినిమా చూస్తారు. మేమందరం సినిమాను ప్రేమించాం అందుకే సినిమా మమల్ని ప్రేమించింది“ అన్నారు.

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ – “నాకు సినిమాని నాకు పరిచయం చేసింది వైజాగ్. నేను నటనలో శిక్షణ తీసుకుంది కూడా ఇక్కడే. మా గురువు సత్యానంద్ గారి దగ్గరే యాక్టింగ్ నేర్చుకున్నాను. ఆ విధంగా సినిమా వల్ల నాకు వైజాగ్ కి గొప్ప రిలేషన్ షిప్ ఏర్పడింది. మీ అందరూ సినిమాను ప్రేమించినంత కాలం మేము మంచి సినిమాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తాం.. ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. హరీష్ గారు బాబాయ్ కి గబ్బర్ సింగ్ తో ఎంత మంచి సినిమా ఇచ్చారో మీ అందరికీ తెలుసు. అంత పెద్దది కాకపోయినా నాకు గద్దల కొండ గణేష్ ఇచ్చారు.  సినిమా డబ్బు, పేరు ఇస్తుంది అని విన్నాం.. కానీ ఇంత ప్రేమ ఇస్తుంద‌ని ఇలా మీ అందర్నీ చూస్తుంటే అనిపిస్తుంది. మీ అభిమానం చూస్తుంటే ఎంత చేసిన తక్కువే అనిపిస్తుంది. మీ అభిమానం కోసం నా శాయశక్తుల ప్రయత్నిస్తాను.“ అన్నారు.