గ‌ప్‌చుప్‌: క‌నిపెడితే కోటి గిఫ్ట్‌!

Last Updated on by

ఈ క్యూటీని చూశారా? ఎంత బుజ్జి బుజ్జిగా ఉందో.. చ‌బ్బీ చ‌బ్బీ బూరె బుగ్గ‌ల‌తో.. డొప్ప ముక్కుతో ఎంత‌ ల‌వ్‌లీగా ఉందో క‌దూ? ఆ చింతాకు క‌ళ్లు చూశాక అయినా క‌నిపెట్ట‌లేక‌పోయారా? క‌నిపెడితే కోటి బ‌హుమ‌తి మీ సొంతం!! ట్రై యువ‌ర్ ల‌క్‌..

ఇంత‌కీ ఎవ‌ర‌బ్బా ఈ క్యూటీ .. చిట్టీ? మ‌రీ అంత క‌ష్ట‌మేం కాదు. చాలాకాలం టాలీవుడ్‌లో స్టార్‌హీరోయిన్ అవ్వాల‌ని క‌ల‌లు గంది. కానీ ఇక్క‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్లు త‌గ‌ల్లేదు. మెగా కాంపౌండ్ హీరోలు పిల‌వ‌నేలేదు. దాంతో సెకండ్ గ్రేడ్ హీరోయిన్‌గానే మిగిలిపోయింది. ఆన‌క బాలీవుడ్‌లో వ‌చ్చిన అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుని అక్క‌డ పేరు తెచ్చుకుంది. ఆ క్ర‌మంలోనే టాలీవుడ్‌లో ఫ‌లానా సీనియ‌ర్ డైరెక్ట‌ర్ డెబ్యూ ఛాన్సిచ్చి అలా చేస్తాడ‌నుకోలేదు. బొడ్డు మీద ఏవేవో వేశాడు! అంటూ కంప్లైంట్ కూడా చేసింది. కొంటెగా క‌వ్వించ‌డం.. ర్యాష్‌గా ఎటాక్ చేయ‌డం ఆవిడ సొంతం. ఇక ఇంత‌కుమించి డీటెయిల్స్ అక్క‌ర్లేద‌నుకుంటాం. మీరే చెప్పండి ఆ పేరేదో!! ఈ క్యూటీ ఇంకెవ‌రు.. తాప్సీ!

User Comments