కాకినాడ లో భారీ అగ్నిప్రమాదం

కాకినాడ నగరంలోని గ్లాస్‌ హౌస్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. గ్లాస్‌ హౌస్‌ సెంటర్‌లో ఉన్న ఓ సూపర్ మార్కెట్‌లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. అందులోని మూడు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. మంట‌ల తీవ్ర‌త భారీగా ఉండ‌టంతో పెద్దాపురం, పిఠాపురం నుంచి నాలుగు అగ్నిమాప‌క శ‌క‌టాల‌ను త‌ర‌లించిన‌ట్లు అధికారులు తెలిపారు.

భ‌వనం ఇరుకు ప్రాంతాంలో ఉండ‌టంతో చుట్టు ప‌క్క‌ల‌కు వెళ్ల‌డానికి వీలు లేకుండా ఉంద‌ని, అంద‌వ‌ల్ల ముందు నుంచే మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలిపారు. అలాగే భ‌వ‌నానికి ఎలాంటి భద్ర‌తా ప్ర‌మాణాలు లేవ‌ని అధికారులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అంటున్నారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read : Why Samantha Said No To Bollywood ?