జ‌యం ర‌వి న్యూ గేమ్ ఛేంజ‌ర్‌

Last Updated on by

ప్ర‌యోగాలు చేయాలి.. ఇండ‌స్ట్రీ మారాలి అని లెక్చ‌ర్లు దంచ‌డ‌మే కాదు. ప్ర‌యోగాత్మ‌క సినిమాలు వ‌స్తే జ‌నం థియేట‌ర్ల‌కు వెళ్లి చూడాలి. ప్ర‌యోగాల‌కు ప్రోత్సాహ‌కంగా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్ని ఎంక‌రేజ్ చేయాలంటే అదొక్క‌టే అస‌లు సిస‌లు మార్గం. ఇప్పుడు ఇండియ‌న్ సినిమా స్క్రీన్‌పై ఓ ప్ర‌యోగం రాబోతోంది. అదే టిక్ టిక్ టిక్‌. జ‌యం ర‌వి – శ‌క్తి సౌంద‌ర రాజ‌న్ అసాధార‌ణ ఎటెంప్ట్ ఇది. భార‌త‌దేశంలో వందేళ్ల చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఎంచుకోని ఏకైక క‌థాంశంతో వ‌స్తున్న మార్వ‌ల‌స్ సినిమాగా టిక్ టిక్ టిక్ గురించి ప్ర‌చారం సాగుతోంది. అంత‌రిక్షం బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత‌మైన ఛాలెంజ్‌తో ఈ సినిమాని తెర‌కెక్కించామ‌ని ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఇలాంటి ప్ర‌య‌త్నం తొలిసారి అని చెబుతున్నారు. `రాజా హ‌రిశ్చంద్ర‌` తొలి ఇండియ‌న్ సినిమా, ఇండియాలో తొలి క‌ల‌ర్ సినిమా `కిసాన్ క‌న్య‌`, ఇండియాలో తొలి డాల్బీ సౌండ్ సినిమా `1942 ఎ ల‌వ్‌స్టోరి`, ఆర్టిఫిషియ‌ల్ లైట్స్‌తో తెర‌కెక్కిన తొలి ఇండియ‌న్ సినిమా `అప‌రాధి`. ఇప్పుడు అదే త‌ర‌హాలో తొలి ఇండియ‌న్ స్పేస్ సినిమా `టిక్ టిక్ టిక్‌` అంటూ కాన్ఫిడెంట్‌గా పోస్ట‌ర్‌ని లాంచ్ చేశారు. మొత్తానికి జ‌యం ర‌వి ఈ సినిమాతో ఏదో ఒక‌టి చేద్దామ‌నే అనుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

టిక్ టిక్ టిక్‌ ఎన్నో అవాంత‌రాల మ‌ధ్య, ఆర్థిక క‌ష్టాల మ‌ధ్య‌ తెర‌కెక్కి ఎట్ట‌కేల‌కు రిలీజ‌వుతోంది. ఈనెల 22న సినిమాని రిలీజ్ చేస్తున్నామ‌ని ప్రోమోలో వేశారు. అంత‌రిక్షం నేప‌థ్యంలో తొలి ఇండియ‌న్ సినిమా, తొలి ద‌క్షిణ భార‌త‌దేశ‌ సినిమా ఇదే అవుతుందన‌డంలో సందేహం లేదు. ఈ సినిమా విజ‌యం సాధిస్తే అది ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్ ఉన్న రెండో ఇండియ‌న్ స్పేస్ సినిమాకి పెద్ద బూస్ట్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. వ‌రుణ్ తేజ్‌-సంక‌ల్ప్ కాంబినేష‌న్‌లో టాలీవుడ్‌లో ఈ ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. టిక్ టిక్ టిక్ విజ‌యం వ‌రుణ్‌తేజ్‌కి బ్లెస్సింగ్ అని భావించ‌వ‌చ్చు. చూద్దాం.. వ్వాట్ విల్ హ్యాపెన్స్‌. మ‌రో రెండ్రోజుల్లోనే టిక్ టిక్ టిక్ రివ్యూ కోసం.. మై ఫ‌స్ట్ షోని ఫాలో కండి..

User Comments