మిస్ట‌ర్ మ‌జ్ను లైవ్ రివ్యూ

Last Updated on by

లైవ్  రేటింగ్‌: 2.5/5.0

ఇదో రొటీన్ గా ఉండే ఒక అంద‌మైన ప్రేమ‌క‌థ‌. ల‌వ్‌, సెంటిమెంట్ సీన్స్ కి ప్రేక్ష‌కులు క‌నెక్ట‌య్యేలా ఫ‌స్టాఫ్‌ని తీర్చిదిద్దిన‌ ద‌ర్శ‌కుడు సెకండాఫ్ ని మాత్రం ఆశించిన స్థాయిలో తెర‌కెక్కించ‌లేక‌పోయాడు. అఖిల్ ప్లేబోయ్ ట‌ర్న్ డ్ ల‌వ‌ర్ బోయ్ గా త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. థ‌మ‌న్ అద్భుత‌మైన రీరికార్డింగ్ ఈ సినిమాకి ప్ల‌స్. ఇటీవ‌లి కాలంలో ఈ త‌ర‌హా ఆర్.ఆర్ లేనేలేదు. ఇక సెకండాఫ్ లో క‌థ ప‌ర‌మ రొటీన్ గా ఫ్లాట్ గా సాగుతూ ముగింపు వ‌ర‌కూ ఒకే తీరుగా ఉంటుంది. హైప‌ర్ ఆది, ప్రియ‌ద‌ర్శి కామెడీ ఆశించిన స్థాయిలో పండ‌లేదు.

ఓవ‌రాల్‌గా సినిమా అంతంత మాత్ర‌మే. బిలో యావ‌రేజ్ నుంచి యావ‌రేజ్ వ‌ర‌కూ అని చెప్పొచ్చు. ఫ‌స్టాఫ్ లో సెంటిమెంట్ సీన్స్ బావున్నా అవి సినిమాకి ఏమేర‌కు సాయ‌మ‌వుతాయో చూడాలి. పోటీ లేకుండా సోలోగా రిలీజైంది కాబ‌ట్టి బాక్సాఫీస్ వ‌ద్ద ఏ మేర‌కు వ‌సూలు చేస్తుందో చూడాలి.

8.05 AM IST: నిక్కీ ఒక‌రికొక‌రు చేరువ‌య్యే స‌మ‌యం.. హ్యాపీ ఎండింగ్.. మాంచి కిక్కిచ్చే లిప్ లాక్ తో .. ది ఎండ్..

8.00 AM IST: హైద‌రాబాద్ కు అఖిల్ షిఫ్టింగ్.. అన్నీ రొటీన్ డైలాగ్స్.. రొటీన్ సీన్స్..

7.45 AM IST: నాలో నీకు సాంగ్ .. టైమ్

7.40 AM IST: టైమ్ ఫ‌ర్ యాక్ష‌న్ సీన్..

7.35 AM IST: కోపంగా కోపంగా సాంగ్.. పాట బావుంది.. న‌డుస్తున్న‌ సీన్స్ నుంచి ప్రేక్ష‌కుల‌కు గుడ్ రిలీఫ్ ..

మూవీ రొటీన్ గా స్లోఫేస్ లో సాగుతోంది..

7.30 AM IST: నిక్కీకి అంకుల్ సుబ్బ‌రాజు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు.

7.25 AM IST: ఒక చిన్న ఫైట్.. అదేమంత ఆక‌ట్టుకోలేదు..

7.15 AM IST: ఆది ప‌క్కింట్లోనే ఉంటోంది నిక్కీ. నిక్కీకి ప్ర‌పోజ్ చేసిన అఖిల్ .. సుబ్బరాజుకు క్లోజ్ అయ్యే ప్ర‌య‌త్నం..

7.10 AM IST: అఖిల్‌లో రియ‌లైజేష‌న్ .. నిక్కీ ప్రేమ ద‌క్కించుకోవ‌డం కోసం యుకే ప‌య‌నం.. పుల్లారావ్ (పైర‌సీ కింగ్) గా హైప‌ర్ ఆది ఎంట్రీ..

7.00 AM IST: యుకే వెళ్లిన నిక్కీ.. ఏమైందో సాంగ్.. జ‌స్ట్ ఓకే

ఫ‌స్టాఫ్ సెంటిమెంట్ గుడ్.. పాట‌లు బావున్నాయ్.. కొన్ని స్లో మూవ్‌మెంట్స్(ల్యాగ్) ఉన్నా పెద్దంత స‌మ‌స్యేం కాదు. సెకండాఫ్‌లో ఏం చూపించ‌బోతున్నారు అన్న‌ది వేచి చూడాల్సిందే..

6.50 AM IST: అఖిల్‌ని విడిచిపెట్టి వెళ్లిన నిక్కీ..  విశ్రాంతి……

6.45 AM IST: ఇరు కుటుంబాలు పెళ్లి చేసేందుకు రెడీ.. కానీ అఖిల్ పెళ్లిపై ఆస‌క్తిగా లేడ‌ని తెలుసుకున్న నిక్కీ

6.35 AM IST: హేయ్ నేనిలా సాంగ్.. నిక్కీ ప్రేమ తో ఫ్ర‌స్టేట్ అయ్యే కుర్రాడిగా అఖిల్ ఎలివేష‌న్..

6.30 AM IST: రెండు నెల‌లు ప్రేమించుకుని ఆ త‌ర్వాతా క‌లిసి ఉంటే అప్పుడు పెళ్లి గురించి ఆలోచించాల‌ని నిర్ణ‌యించుకున్న నిక్కీ- అఖిల్ జంట‌

6.25 AM IST: అఖిల్‌కి ప‌డిపోయిన నిధి.. అతడి ప్ర‌వ‌ర్త‌న‌, యాటిట్యూడ్ కి ఫిదా.. ప్ర‌పోజ్ చేసిన నిక్కీ(నిధి)..

6.15 AM IST: చిరు చిరు న‌వ్వుల సాంగ్ .. సెట్ లో తెర‌కెక్కించిన ఈ పాట బావుంది..

6.05 AM IST: ఫ‌స్ట్ యాక్ష‌న్ సీన్ కి టైమ్ వ‌చ్చింది…

6.00 AM IST: గ్యాంగ్ స్ట‌ర్ అజ‌య్ ఎంట్రీ.. సెంటిమెంట్ స‌న్నివేశాలు.. బావున్నాయ్.

5.55 AM IST: అఖిల్ స్నేహితుడు ప్రియ‌ద‌ర్శి ఎంట్రీ.. అత‌డి పాత్ర హెలోబ్ర‌ద‌ర్ త‌ర‌హా కామెడీ..

5.50 AM IST: అఖిల్  డాడ్ నాగ‌బాబు ఎంట్రీ.. నెఫ్యూ పెళ్లికి హీరో – హీరోయిన్ వ‌చ్చారు..

5.45 AM IST: ఇండియాకి క‌థ షిఫ్ట్.. ఒకే విమానంలో ఇండియా వ‌చ్చిన అఖిల్, నిధి. అఖిల్ బాబాయ్ గా రావ్ ర‌మేష్ ఎంట్రీ..

5.40 AM IST: మిస్ట‌ర్ మ‌జ్ను టైటిల్ సాంగ్.. పాట బావుంది..

5.35 AM IST: లండ‌న్ లో సినిమా మొద‌లు.. నిక్కీ (నిధి) పెళ్లి ప్రపోజ‌ల్స్ తిర‌స్కారం..  సుబ్బ‌రాజు ఎంట్రీ

5.30 AM IST:  సినిమా ఇప్పుడే ప్రారంభ‌మైంది

అఖిల్‌ అక్కినేని న‌టించిన తొలి రెండు చిత్రాలు ఆశించిన విజ‌యాలు సాధించ‌క‌పోయినా, న‌టుడిగా, డ్యాన్స‌ర్ గా అత‌డు ఫెయిల్ కాలేద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అందుకే అక్కినేని చియాన్ న‌టిస్తున్న మూడో సినిమా `మిస్ట‌ర్ మ‌జ్ను`పై అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. తొలి టీజ‌ర్, పోస్ట‌ర్, ట్రైల‌ర్ తోనే అఖిల్ ఇంప్రెష‌న్ కొట్టేశాడు. దాంతో ఈసారైనా హిట్ కొడ‌తాడా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఈ చిత్రాన్ని అత్తారింటికి దారేది, మ‌గ‌ధీర (స‌హ‌నిర్మాత‌) వంటి చిత్రాల్ని నిర్మించిన శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి అధినేత బివిఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మించారు. `తొలిప్రేమ` ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వ ం వ‌హించారు. సెన్సార్ యుఎ స‌ర్టిఫికేట్ ద‌క్కింది. ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

అఖిల్‌ అక్కినేని సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించిన‌ ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందించారు. అక్కినేని బ్రాండ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇద‌న్న ప్ర‌చారం సాగింది… అందుకు త‌గ్గ‌ట్టే అఖిల్ ఆ స్థాయిలో క‌నిపించాడా లేదా? న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు వెంకీపై పెట్టుకున్న ఆశ‌లు నెర‌వేరాయా లేదా? అన్న‌ది తెలియాలంటే స‌మీక్ష‌లోకి వెళ్లాల్సిందే…

న‌టీన‌టులు: అఖిల్, నిధి అగ‌ర్వాల్ త‌దిత‌రులు..
ద‌ర్శ‌క‌త్వ ం: వెంకీ అట్లూరి
నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్. ప్ర‌సాద్
సంగీతం: థ‌మ‌న్
రిలీజ్ తేదీ: 25-01-2019

User Comments