ఫ‌స్ట్ లుక్‌: అభిన‌వ శ్రీ‌దేవి

Last Updated on by

నేరేడు క‌ళ్లు .. నీలాల కురులు.. బూరెల బుగ్గ‌లు.. ఈ రూపం ఎక్క‌డో చూసిన‌ట్టే ఉందే! అని క‌న్ఫ్యూజ్ అవ్వొద్దు. ఈ రూపం శ్రీ‌దేవి రూపం. పంజాబీ బ్యూటీ ర‌కుల్ మ్యాగ్జిమం శ్రీ‌దేవి త‌ర‌హాలో క‌నిపించేందుకు చేసిన ప్ర‌య‌త్నం మెచ్చుకోవాలి. మ‌నిషిని పోలిన మ‌నుషులు ఏడుగురు ఈ లోకంలో ఉంటార‌ని చెబుతుంటారు. మ‌రి శ్రీ‌దేవిని పోలిన శ్రీ‌దేవిలు ఎక్క‌డున్నారో వెతుక్కోలేం కానీ, ఇప్ప‌టికి ర‌కుల్ లో వెతుక్కోవాల్సిందే. ఆ రోజుల్లో చెంగావి చీర‌క‌ట్టు చిన్న‌ది.. హాఫ్ స్లీవ్ జాకెట్ తో నుదిటిన వైట్ స్టిక్క‌ర్ చూడ‌గానే శ్రీ‌దేవి తాలూకానే అనిపించింది. ఆ క‌ళ్లు, బుగ్గ‌లు, ముకుతీరు కాస్తంత పోలిక క‌నిపించింది. వంద శాతం శ్రీ‌దేవి అని స్టాంప్ వేయ‌లేక‌పోయినా ర‌కుల్ త‌ప్ప వేరొక ఆప్ష‌న్ లేనేలేదని అర్థ‌మ‌వుతోంది. మొత్తానికి ఎన్టీఆర్ స‌ర‌స‌న శ్రీ‌దేవి హొయ‌లు పెద్ద తెర‌పై మ‌రోసారి చూడ‌బోతున్నాం. అది కూడా ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు సినిమాలో.

క్రిష్ ఈ చిత్రాన్ని శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. సంక్రాంతి రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టే ప‌నుల‌న్నీ వేగంగానే పూర్త‌వుతున్నాయి. ఈ చిత్రంలో ఏఎన్నార్‌గా సుమంత్, చంద్ర‌బాబుగా రానా అద్భుతంగా కుదిరారు. ఇప్పుడు శ్రీ‌దేవి పాత్ర‌కు ర‌కుల్ అంతే సూటైంది. నేడు ర‌కుల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ లుక్‌ని రివీల్ చేశారు. అతిలోక సుంద‌రి పైనుంచి చూస్తూనే ఉంటుంది .. ర‌కుల్‌లోని ఈ అభిన‌వ శ్రీ‌దేవిని. క్ష‌ణ‌క్ష‌ణం శ్రీ‌దేవిలా ప‌ది సెక‌న్ల పాటు ఆ క‌నురెప్ప‌ల్ని ట‌ప‌ట‌ప‌లాడించ‌వూ ప్లీజ్… డార్లింగ్ శ్రీ‌దేవీ!

User Comments