హాకీ ప్లేయ‌ర్‌ తాప్సీ స్ట‌న్నింగ్‌

Last Updated on by

పింక్‌, నామ్ స‌బానా చిత్రాల‌తో బాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. డేరింగ్ & డ్యాషింగ్ గాళ్‌గా అద్భుత న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. పింక్ చిత్రంతో క‌మ‌ర్షియ‌ల్ నాయిక‌గానూ ఐడెంటిటీ అందుకుంది. ఇటీవ‌లే కుర్ర‌హీరో ధావ‌న్ స‌ర‌స‌న‌  `జుడ్వా 2` చిత్రంలో న‌టించి మెప్పించింది. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గానూ చ‌క్క‌ని విజ‌యం అందించింది. ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తూ బిజీగా ఉంది తాప్సీ ప‌న్ను. త‌డ్కా , సూర్మ , ముల్క్ , మ‌న్మార్జియాన్ .. వంటి భారీ చిత్రాలతో తాప్సీ క్ష‌ణం తీరికలేకుండా ఉంది. మ‌రోవైపు టాలీవుడ్‌లోనూ క‌థ‌లు వింటోంద‌ని తెలుస్తోంది.

లేటెస్టుగా బాలీవుడ్ క్రేజీ మూవీ `సూర్మ‌‌`లో తాప్సీ లుక్‌ని రివీల్ చేశారు. హాకీ క్రీడాకారిణి హ‌ర్‌ప్రీత్ పాత్ర‌లో తాప్సీ లుక్ ఇది. హ‌ర్‌ప్రీత్ లుక్‌‌ మోష‌న్ పోస్ట‌ర్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంది. షాద్అలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ క్రేజీ క్రీడా నేప‌థ్య చిత్రం జూలై 13న విడుద‌ల‌వుతోంది. దిల్జీత్ దోసాంజి , అంగాన్ భేడీ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లు పోషించారు.  హాకీ లెజెండ్ సందీప్ సింగ్ జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో తాప్సీ పాత్ర సంథింగ్ స్పెష‌ల్‌గా ఉండ‌నుంద‌ని తాజా మోష‌న్ పోస్ట‌ర్ చెబుతోంది.

User Comments