స్పేస్ మూవీ సీక్రెట్ లీక్‌

Last Updated on by

టాలీవుడ్ హిస్ట‌రీలోనే ఒక స్పేస్ మూవీ తీయ‌డం అన్న‌ది ఊహించ‌లేనిది. స‌ముద్ర గ‌ర్భంలో జ‌లాంత‌ర్గామిపై సినిమా తీయ‌డం అన్న‌దే ఓ సెన్సేష‌న్ అనుకుంటే, ఇప్పుడు ఏకంగా స్పేస్ మూవీనే తీసేందుకు తెగించాడు సంక‌ల్ప్ రెడ్డి. అత‌డు ఏం చేసినా కొత్త ప్ర‌యోగ‌మే. ఇటీవ‌లే త‌మిళంలో తెర‌కెక్కిన స్పేస్ మూవీ తెలుగులో `టిక్ టిక్ టిక్‌` పేరుతో అనువాద‌మై రిలీజైంది. జీరో గ్రావిటీలో అదిరిపోయే విజువ‌ల్స్‌ని ఈ సినిమాలో చూపించార‌న్న మంచి టాక్ వ‌చ్చింది. శ‌క్తి సౌంద‌ర రాజ‌న్ త‌న శ‌క్తిని, యుక్తిని ఉప‌యోగించి ఆ సినిమాని అద్భుతంగా తెర‌కెక్కించారు. అర‌వ‌కామెడీ మ‌న‌వాళ్ల‌కు న‌చ్చ‌క‌పోయినా, స్పేస్‌లో బ్రిలియంట్ ఎపిసోడ్స్ ఆక‌ట్టుకున్నాయ‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఆ క్ర‌మంలోనే సంక‌ల్ప్‌కి ఇది అద‌న‌పు బ‌లాన్ని చేకూర్చింది.
అదంతా అటుంచితే మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ స‌హ‌కారంతో సంక‌ల్ప్ ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడ‌న్న టాక్ వినిపిస్తోంది. వ‌రుణ్‌, అదితీరావ్ హైద‌రీ ఈ సినిమా కోసం 3డి స్కాన్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ తేదీని లాక్ చేశార‌న్న టాక్ వినిపిస్తోంది. డిసెంబ‌ర్ 21న ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. జ్ఞాన‌వేల్ రాజా సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ వ‌ర్క్ మైమ‌రిపిస్తుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.

User Comments