బాల‌య్య పై ప్లాష్ బ్యాక్ సీన్స్ పీక్స్ లో?

న‌ట‌సింహ బాలకృష్ణ -కె ఎస్ రవికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే థాయ్‌లాండ్‌లో రామోజీ ఫిలిం సిటీ లో రెండు షెడ్యూల్ పూర్తిచేసారు. తాజాగా ఓ షెడ్యూల్ లో భాగంగా భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించినట్లు తెలిసింది. అవి సినిమాలో ప్లాష్ బ్యాక్ లో వ‌చ్చే సన్నివేశాలుట‌. హోమం జ‌రుగుతుండ‌గా బాల‌య్య పై ప్ర‌త్య‌ర్ధులు అటాక్ చేస్తారుట‌. ఈ క్రమంలోనే ఓ భారీ ఫైట్ వస్తోందిట‌. ఆ స‌న్నివేశాల‌నే ఫిలిం సిటీ లో షూట్ చేసిన‌ట్లు తెలిసింది. ఆ సీన్స్ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయ‌ని అంటున్నారు.

అలాగే దసరా కానుకగా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. టీజ‌ర్ కు సంబంధించిన ప‌నుల్లో టెక్నిక‌ల్ టీమ్ బిజీ అయిన‌ట్లు స‌మాచారం. అక్టోబర్ 5 నుండి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టనున్నారుట‌. ఇటీవ‌ల విడుద‌లైన బాలయ్య ఫస్ట్ లుక్‌ కి ప్రేక్ష‌కాభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.