కొరటాల సినిమాలో చిరంజీవి విల‌నా..?

Last Updated on by

అవునా.. చిరంజీవిని విల‌న్ చేసే ధైర్యం కొర‌టాల చేస్తాడా..? ఏమో ఏదైనా జ‌ర‌గొచ్చు.. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి రాజ‌కీయ నాయ‌కుడు కాదు. ఈయ‌న వ‌రస సినిమాల‌తో రెచ్చిపోతున్నాడు. పూర్తి స్థాయిలో సినిమా హీరో అయ్యాడు చిరు. అందుకే క‌థ‌లు విన‌డం.. ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల‌పై దృష్టి పెట్ట‌డం త‌ప్ప మ‌రో ఆలోచ‌నే లేదు ఇప్పుడు మెగాస్టార్ బుర్ర‌లో. ఇదే క్ర‌మంలో కొర‌టాల చెప్పిన క‌థ‌ కూడా మెగాస్టార్ ను బాగా ఆక‌ట్టుకుంది. ఈ క‌థ‌పైనే ప్ర‌స్తుతం కొర‌టాల కూర్చున్నాడు. పారిస్ వెళ్లినా అక్క‌డ కూడా చిరు క‌థ‌ను పూర్తి చేసే ప‌నిలోనే కొర‌టాల ఉన్నాడ‌ని తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ని.. అది కూడా క‌మ‌ల్ ఆల్ టైమ్ క్లాసిక్ ఇంద్రుడు చంద్రుడు లైన్ తో ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియ‌దు కానీ ఖచ్చితంగా ఈ సినిమాలో చిరు రెండు పాత్ర‌లు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న కెరీర్ లో చేయ‌ని విధంగా ఉంటాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

అందుకే చిరు కూడా విన‌గానే కొర‌టాల‌కు ఓకే చెప్పాడు. ప్ర‌స్తుతం ఈ క‌థ‌కు స్క్రీన్ ప్లే రాసే ప‌నిలో ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇదిలా ఉంటే నిజానికి చర‌ణ్ తో కొర‌టాల సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈయ‌న బోయ‌పాటితో పాటు రాజ‌మౌళి సినిమా కూడా క‌మిట‌వ్వ‌డంతో త‌న‌యుడి స్థానంలో తండ్రితో సినిమా వ‌ర్క‌వుట్ చేసుకున్నాడు కొర‌టాల శివ‌. అన్నీ కుదిర్తే వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ చిత్రం మొద‌లు కానుంది. మ‌రి ఇంద్రుడు చంద్రుడు అంటే అందులో క‌మ‌ల్ హాస‌న్ విల‌న్ గా న‌టించాడు. మ‌రి చిరును విల‌న్ గా చూపించే ద‌మ్ము కొర‌టాల‌లో ఉందా..? స‌రైన విధంగా చూపించాలే కానీ ఎలా చూపించినా ఇప్పుడు హీరోల‌ను రిసీవ్ చేసుకునే మ‌న‌సు ప్రేక్ష‌కుల‌కు వ‌చ్చేసింది.

User Comments