న‌వంబ‌ర్ లో పెళ్లి.. రాస్కోరా సాంబ..!

Last Updated on by

ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలి. ఎంత క‌ష్టం వ‌చ్చినా.. ఎవ‌రు ఎదిరించాల‌ని చూసినా కూడా చివ‌రికి పెళ్లితోనే ఒక్క‌టి కావాలి.. ఇదే ఇప్పుడు బాలీవుడ్ సిద్ధాంతం. ఈ మ‌ధ్య ప్రేమ‌ప‌క్షులు అంతా బాగానే ఒక్క‌టైపోయారు. విరాట్-అనుష్క శ‌ర్మ‌.. ఆనంద్ అహూజా-సోన‌మ్ క‌పూర్.. ఇలా చాలా మంది త‌మ ప్రేమ‌ను పెళ్లితో ముగించారు. ఇప్పుడు దీపిక కూడా ఇదే చేయ‌బోతుంది. ఈమె కూడా త‌ను ప్రేమిస్తున్న ర‌ణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకోబోతుంది. కొన్ని నెల‌లుగా ఈమె సినిమాల‌కు దూరంగా ఉంది. పెళ్లైతే సినిమాలు మానేస్తారా..? అది కూడా బాలీవుడ్ లో..? అస‌లు వాళ్లు పెళ్లి చేసుకున్నా చేసుకోన‌ట్లే ఉంటారు క‌దా..! అయితే ప‌ద్మావ‌తి త‌ర్వాత దీపిక ఒక్క సినిమాకు కూడా సైన్ చేయ‌లేదంటే న‌మ్మ‌డం సాధ్యం కాదు. కానీ ఇదే నిజం. ప్ర‌స్తుతం షారుక్ జీరో సినిమాలో గెస్ట్ రోల్ త‌ప్ప మ‌రే సినిమా చేయ‌ట్లేదు దీపిక‌.

ఇర్ఫాన్ ఖాన్ హీరోగా విశాల్ భ‌ర‌ద్వాజ్ తో చేయాల్సిన సినిమా ప్ర‌స్తుతానికి ఇర్ఫాన్ ఆరోగ్యం దృష్ట్యా ఆగిపోయింది. దానికితోడు కొత్త సినిమాలు కూడా సైన్ చేయ‌డం లేదు దీపిక‌. దీనికి కార‌ణం ఆమె ర‌ణ్ వీర్ సింగ్ ను త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతుంది. ఇప్పుడు కానీ కొత్త సినిమాల‌కు సైన్ చేస్తే పెళ్లి టైమ్ కు అవి పూర్తి కావ‌ని దూరంగా ఉంటుంది ఈ భామ‌. న‌వంబ‌ర్ లోనే ఈ ఇద్ద‌రి పెళ్లి జ‌ర‌గ‌బోతుంది. న‌వంబ‌ర్ 12-16 మ‌ధ్య దీపిక‌, ర‌న్ వీర్ పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఇరు కుటుంబాలు పెళ్లి పనుల‌తో బిజీ అయిపోయారు కూడా. ఈ లోపు ర‌ణ్ వీర్ సింగ్ కూడా త‌ను ఒప్పుకున్న టెంప‌ర్ రీమేక్ సింబా షూటింగ్ పూర్తి చేస్తాడు. మొత్తానికి న‌వంబ‌ర్ లోనే ఈ జంట ఒక్క‌టి కానుంది.

User Comments