ప్రియాంక తెగించేసింది..!

ప్రియాంక చోప్రా అంటే ఇన్నాళ్ళూ కేవ‌లం ఇండియ‌న్ సినిమా హీరోయిన్ అని స‌రిపెట్టుకునేవాళ్లు కానీ ఇప్పుడు అలా కాదుగా. క్వాంటికో సిరీస్.. బేవాచ్ సినిమాల త‌ర్వాత అక్క‌డ కూడా ప్రియాంకకు స్టార్ ఇమేజ్ వ‌చ్చేసింది. హాలీవుడ్ స్టార్స్ తో ప‌రిచ‌యాలు పెరిగిపోయాయి. పైగా అవకాశాలు కూడా బాగానే వ‌స్తున్నాయి. దీపిక అంటే ఒక్క సినిమానే ఇండియాకు వ‌చ్చేసింది కానీ పిసి మాత్రం అక్క‌డే సెటిల్ అయిపోవాల‌ని చూస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో ఓ పాతికేళ్ల కుర్రాడితో ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంద‌నే వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. సాక్ష్యం కింద కొన్ని ఫోటోలు కూడా క‌నిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు పూర్తి సాక్ష్యాలు త‌నే ఇచ్చేసింది. త‌న ప్రియుడు నిక్ జోసెన్ ను ఇండియాకు తీసుకొని వ‌చ్చింది ప్రియాంక చోప్రా. ముంబైలో ప్రియాంక 100 కోట్ల‌తో ఇళ్లు తీసుకుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఇంట్లోని త‌న ప్రియుడితో క‌లిసి కాలు మోప‌నుంది ఈ భామ‌.

Priyanka Chopra,

కొన్ని రోజులుగా ప్రియాంక‌, నిక్ తీరు చాలా అనుమానాస్ప‌దంగా ఉంది. ఈ ఇద్ద‌రూ త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకుంటార‌ని తెలుస్తుంది. వీళ్లిద్ధ‌రి మ‌ధ్య బంధాన్ని చూసిన వాళ్లెవ్వ‌రైనా ఈ మాటే అనుకుంటారు కూడా. డేటింగ్ లో కాదు.. ఏకంగా ఇంకేదో చేస్తున్నార‌నే ఊహ‌లు నిజం అని వినిపిస్తున్నాయి.. సాక్ష్యాలు క‌నిపిస్తున్నాయి. అస‌లు ఈ నిక్ తో ప్రియాంక‌కు ప‌రిచ‌యం అయింది ఇప్పుడు కాదు.. 2017 గాలా రెడ్ కార్పెట్ ద‌గ్గ‌రే ఈ ఇద్ద‌రూ తొలిసారి క‌లిసారు.. అక్క‌డే జంటగా మెరిశారు. ఆ సందర్భంగా ఒకరోజు డేట్ కు వెళ్లారు. అస‌లు అప్ప‌టి వ‌ర‌కు తెలియ‌ని వ్య‌క్తితో.. అందులోనూ త‌న‌కంటే వ‌య‌సులో ప‌దేళ్లు చిన్న‌వాడైన నిక్ జోన‌స్ తో డేటింగ్ కు ఎందుకు వెళ్లిందో తెలుసా.. ఇద్ద‌రూ ఒకే క‌ల‌ర్ డ్ర‌స్ వేసుకున్నార‌ని. ఇది విన్న త‌ర్వాత అంద‌రి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అయినా నిక్ చిన్న పిల్లోడు కాదుగా అంటూ వింత స‌మాధానాలు కూడా ఇస్తుంది ప్రియాంక చోప్రా. ఇదంతా చూస్తుంటే పెళ్లి మాటేమో కానీ ఖచ్చితంగా ప్రియాంక‌ ఆ కుర్రాడితో డేటింగ్ లో ఉంద‌నే విష‌యం అయితే అర్థ‌మ‌వుతుంది

Priyanka Chopra,