ఖాకీ.. స్కెచ్.. రెండూ రెండే..

త‌మిళ అభిమానుల‌కు దీపావ‌ళి కానుక ఇచ్చారు కార్తి అండ్ విక్ర‌మ్. త‌మ ఫ్యాన్స్ కు కొత్త సినిమాల టీజ‌ర్స్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. కార్తి ఏకంగా ట్రైల‌ర్ తో వ‌స్తే.. విక్ర‌మ్ స్కెచ్ టీజ‌ర్ విడుద‌ల చేసాడు. ఈ రెండు సినిమాల‌పై త‌మిళ‌నాట‌ మంచి అంచ‌నాలే ఉన్నాయి. పైగా ప్ర‌స్తుతం ఇద్ద‌రు హీరోలు ఇప్పుడు ఫ్లాపుల్లోనే ఉన్నారు. చెలియా ఫ్లాప్ తో వెన‌క‌బ‌డిన కార్తి.. ఖాకీ సినిమాతో మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌ని చూస్తున్నాడు. తీరాన్ అధిగారం ఒండ్రు టైటిల్ తో ఇది త‌మిళ్ లో విడుద‌ల కానుంది. వినోద్ అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం త‌మిళ‌నాట 1995-2005 మ‌ధ్య జ‌రిగిన కొన్ని వాస్త‌విక సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందింది. ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగానే ఉంది. పోలీసుల‌కు.. రౌడీల‌కు.. రాజ‌కీయ నాయ‌కుల‌కు మ‌ధ్య జ‌రిగే పోరాట‌మే ఈ చిత్రం.

ఇక విక్ర‌మ్ స్కెచ్ సినిమా టీజ‌ర్ అయితే మ‌రీ రొటీన్ గా ఉంది. ఎప్ప‌ట్లాగే త‌మిళ వాస‌న‌లు నింపుకున్న మాస్ మాసాలా సినిమాగా స్కెచ్ వ‌స్తుంది. విజ‌య్ చంద‌ర్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంది. న‌వంబ‌ర్ లో ఈ రెండు సినిమాలు విడుద‌ల కానున్నాయి. విక్ర‌మ్ కు అయితే గ‌త కొన్నేళ్లుగా స‌రైన విజ‌యం లేదు. ఇప్పుడు స్కెచ్ అయిన త‌న ఆశ తీరుస్తుంద‌ని న‌మ్ముతున్నాడు ఈ హీరో. మొత్తానికి ఇటు కార్తి.. అటు విక్ర‌మ్.. ఇద్ద‌రూ దీపావళిని అభిమానుల‌తో బాగానే సెలెబ్రేట్ చేసుకున్నారు.