ఫోర్బ్స్‌లో ఏకైక కిల్ల‌ర్ లేడీ

వార్షికాదాయం ఆధారంగా రూపొందించే ఫోర్బ్స్ జాబితాలో దీపిక స్థానం 5. అయితే ఎంత సంపాదిస్తోంది? అంటే ఏడాదికి 112.8 కోట్లు ఆర్జిస్తోంద‌ని ఫోర్బ్స్ రివీల్ చేసింది. ప్ర‌స్తుతం ఈ భామ ఎన‌ర్జిటిక్ ఎర్న‌ర్ ర‌ణ‌వీర్ సింగ్‌ని పెళ్లాడింది కాబ‌ట్టి భార్యాభ‌ర్త జాయింట్ ఆదాయం ఇంకా స్కైలో ఉంటుంద‌నేది ఆర్థిక నిపుణుల అంచ‌నా. ఇక ఫోర్బ్స్ టాప్ 5లో చేరిన తొలి భార‌తీయ మ‌హిళ కూడా దీపిక‌నే. ఆ మేర‌కు ఫోర్బ్స్ ఇండియా మ్యాగ‌జైన్ వివ‌రాల్ని అందించింది.

ఫోర్బ్స్ టాప్ 100 జాబితాలో అనుష్క శ‌ర్మ‌, క‌త్రిన కైఫ్‌, ఆలియా భ‌ట్ ఉన్నారు. గ‌త ఏడాది ఈ జాబితాలో 21 మంది మ‌హిళ‌లు ఉంటే, ఈసారి మాత్రం 18 మంది మాత్ర‌మే ఉన్నారని స‌ద‌రు మ్యాగ‌జైన్ పేర్కొంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇండియా నంబర్ 1 ధ‌న‌వంతుడిగా నిలవడం విశేషం. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో స్థానం అందుకోగా, ఆ తర్వాత అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే, ఎం.ఎస్.ధోని, ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రణ‌వీర్ సింగ్, సచిన్ తెందుల్కర్, అజయ్ దేవగణ్ జాబితాలో వ‌రుస‌గా టాప్‌10లో నిలిచారు.