#RRR విదేశీ హాటీస్ ట్రీట్

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని ముందే ప్ర‌క‌టించిన తేదీకే రిలీజ్ చేసేందుకు డెడ్ లైన్ ప్ర‌కారం శ్ర‌మిస్తున్నారు. ఇదివ‌ర‌కూ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ధారి చ‌ర‌ణ్ .. ఆలియా భ‌ట్ జంట‌పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం తార‌క్ తో పాటు క‌థానాయిక స‌న్నివేశాల్ని తెర‌కెక్కించాల్సి ఉంద‌ట‌.

అయితే ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్ర‌ధారి తార‌క్ స‌ర‌స‌న న‌టించేది ఎవ‌రు అన్న‌దానిపై స‌రైన స‌మాచారం లేదు. ఆ పాత్ర కోసం ప‌లువురు విదేశీ ముద్దుగుమ్మ‌ల్ని ప‌రిశీలించి అందులో ఓ ఇద్ద‌రిని ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. ఆ ఇద్ద‌రు ఐరిష్ గాళ్స్. కొమురం భీమ్ పాత్ర‌ధారి స‌ర‌స‌న జోసెఫీన్ లాంగ్ ఫోర్డ్ ని ఫైన‌ల్ చేశారు. అలాగే ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర‌కు ప్ర‌ఖ్యాత న‌టి అలీస‌న్‌ డూడీని ఎంపిక చేశారు. ఇండియానా జోన్స్ – ది లాస్ట్ క్రూసేడ్, డివిజన్ 19 లాంటి భారీ హాలీవుడ్ చిత్రాల్లో ఈ భామ న‌టించింది. అల్లూరి సీతారామ‌రాజు- కొమురం భీమ్ ఎదిగే క్ర‌మంతో పాటు స్వాతంత్య్ర స‌మ‌రంలో పాల్గొనే క్ర‌మంలో ఆ ఇద్ద‌రి లైఫ్ లో జ‌రిగిన ఫిక్ష‌న్ క‌థేమిటి? అన్న‌ది తెర‌పై చూపిస్తున్నారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ చిత్రానికి క‌థ‌ను అందించారు.