భ‌ర‌త్ 4 సీన్లు ఇవే .. అబ్బ‌బ్బ‌!

Last Updated on by

అస‌లు డివివి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ ఏంటో కానీ.. అస‌లు ఆ విధానాన్ని రూపొందించిన తీరును ప్ర‌శంసించి తీరాలి. సినిమా రిలీజ్ 10 రోజుల నుంచి భ‌ర‌త్ టీమ్ చేస్తున్న హంగామా చూస్తే, ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. అస‌లు 90ఏళ్ల టాలీవుడ్ హిస్ట‌రీలో, వందేళ్ల భార‌తీయ‌ సినిమా హిస్ట‌రీలో అస‌లు ఇంత‌గా ఎవ‌రూ ప్ర‌చారం చేసి ఉండ‌రేమో? అనిపించ‌క మాన‌దు. ప్ర‌తిరోజూ యూనిట్ ప్ర‌చారార్భాటంతో హోరెత్తించేస్తోంది. డివివి మీడియా టాలీవుడ్‌లో ఏ ఇత‌ర మీడియా చేయ‌నంత ప్ర‌చారం చేసింది. అయితే ఈ ప్ర‌చారంలో భాగంగా .. ఒకే ఒక్క మంచి ప‌ని కూడా జ‌రిగింది.

అదేమంటే.. అస‌లు 100 కోట్ల క్ల‌బ్‌, 200 కోట్ల క్ల‌బ్ అని చెప్పుకునే సినిమాల‌కు ఫలానా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ప‌ని చేశాడు అని ఏనాడూ చెప్ప‌లేక‌పోయాం. కానీ భ‌ర‌త్ సినిమాకి ఎంత‌మంది అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు, రైట‌ర్లు ప‌ని చేశారు? అన్న‌ది వెంట‌నే ఠ‌కీమ‌ని చెప్పేయ‌గ‌లం. ఇది గ్రేట్ అఛీవ్‌మెంట్. కొర‌టాల‌& డీవీవీ సంస్థ చేసిన ఈ మంచి ప‌ని ఎప్ప‌టికి మ‌ర్చిపోలేనిది. చిన్నా చిత‌కా.. బ‌డుగు.. బ‌క్క కుటుంబాల నుంచి వ‌చ్చి అసిస్టెంట్ డైరెక్ట‌ర్లుగా పొట్ట పోషించుకునేవారెంద‌రో. వారికి అస‌లు గుర్తింపు అన్న‌దే ఉండ‌దు. సినిమా ఆడాక‌, లేదా పోయాక .. వాళ్ల‌ను అంతా మ‌ర్చిపోతారు. త‌ర‌వాత అదే కంపెనీలో ప‌ని చేస్తారో లేదో కూడా చెప్ప‌లేం. అలాంటి వారికి సంబంధించిన విజువ‌ల్ ప్రూఫ్‌ని ఇచ్చారు. లేటెస్టుగా డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ భ‌ర‌త్ అనే నేను చిత్రంలోని నాలుగు అన్‌క‌ట్ సీన్స్ ని రిలీజ్ చేసింది. రైతు స‌న్నివేశం, గ‌ర్భిణి స‌న్నివేశం, విద్యావ్య‌వ‌స్థ‌పై స‌న్నివేశం, అసెంబ్లీ స‌న్నివేశం.. ఇవ‌న్నీ యూట్యూబ్‌లో అందుబాటులోకి వ‌చ్చాయి. కొర‌టాల‌& దాన‌య్య‌కు హ్యాట్సాఫ్‌.

Farmer Scene :

Pregnant Woman Scene :

 

Education Scene :

Assembly Scene :

User Comments