ఫ్రైడే రిలీజ్‌: మార్చి ఆశ‌ల‌న్నీ ఆవిరేనా!

Last Updated on by

ప్ర‌తి శుక్ర‌వారం య‌థావిధిగా సినిమాలు రిలీజ‌వుతున్నాయి. కానీ వాటిలో నిల‌బ‌డే సినిమా ఏది? అన్న‌ది మాత్రం ఫ‌జిల్ గానే మారింది. వీటిలో ఆయారాం గ‌యారాం బాప‌తే ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. టాలీవుడ్ స‌క్సెస్ శాతాన్ని త‌గ్గించేసి వెళుతున్నాయి. ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద మూడు సినిమాలు పోటీ ప‌డ్డాయి. వేర్ ఈజ్ వెంక‌ట‌ల‌క్ష్మి, జెస్సీ, బిలాల్ పూర్ చిత్రాలు రిలీజ‌య్యాయి. రిలీజైన ఏ సినిమాకి స‌రైన స్పంద‌న జ‌నాల్లో లేదు. ఆ సినిమాలు వ‌చ్చాయా? అన్న‌ట్టే ఉంది. ప్ర‌చారం లేదు.. క్యూరియాసిటీ లేదు.. ఆడ‌నూ లేదు! అన్న‌ట్టే ఉంది సీను. ఈ శుక్ర‌వారం స‌న్నివేశం అలా ఉంది కావ‌ట్టి మార్చి 22 పైనే ఆశ‌ల‌న్నీ.

రాబోవు శుక్ర‌వారం ఆర్జీవీ తెర‌కెక్కించిన‌ వివాదాస్ప‌ద చిత్రం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజ్ కానుంది. ఏపీ ఎన్నిక‌ల ముందు ఈ సినిమా వేడి పెంచుతుందా? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. వివాదాల‌తో ప్ర‌చారం కొట్టేసిన వ‌ర్మ .. ఈ సినిమాని సాఫీగా రిలీజ్ చేయ‌గ‌ల‌డా? అన్న చ‌ర్చ సాగుతోంది. కోర్టు గొడ‌వ‌ల్ని దాటుకుని ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ‌వుతుందా? అన్న‌ది ఉత్కంఠ పెంచుతోంది. మెగాడాట‌ర్ నిహారిక న‌టించిన సూర్య కాంతం, నిఖిల్ న‌టించిన అర్జున్ సుర‌వ‌రం మార్చి 29న రిలీజ‌వుతున్నాయి. ఆ సినిమాల‌పై ఆ ఇద్ద‌రూ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. అటుపై నాగ‌చైత‌న్య- స‌మంత జంట‌గా న‌టించిన మ‌జిలీ ఏప్రిల్ 5న‌ రిలీజ్ బ‌రిలోకి వ‌స్తోంది. క‌నీసం ఈ నాలుగైదు సినిమాల్లో ఏవైనా బాక్సాఫీస్ ఆశ‌ల్ని స‌జీవంగా ఉంచుతాయేమో చూడాలి. మే 9న మహేష్ మ‌హ‌ర్షి వ‌చ్చే వ‌ర‌కూ సినిమాలపై జ‌నాల్లో ఆస‌క్తి నిల‌బెట్ట‌గ‌ల‌రా.. అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.

User Comments