ట్రైయాంగిల్ వార్ విజేత‌?

ప్ర‌తి శుక్ర‌వారంలానే ఈ శుక్ర‌వారం(జూన్ 1) కూడా క్రేజీగా ప‌లు చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. ఈసారి ట్రైయాంగిల్ వార్‌ షురూ అయ్యింది. కింగ్ నాగార్జున న‌టించిన ఆఫీస‌ర్‌, విశాల్‌-అభిమ‌న్యుడు, రాజ్‌త‌రుణ్ -రాజుగాడు సినిమాల మ‌ధ్య ప్ర‌ధాన పోటీ నెల‌కొంది. శివ తెర‌కెక్కించిన ఆర్జీవీతో చాలా గ్యాప్ త‌ర‌వాత‌ క‌లిసిన‌ నాగార్జున ఈసారి సీరియ‌స్ కాప్ డ్రామాని ఎటెంప్ట్ చేశాడు. ఈ సినిమా క‌చ్ఛితంగా హిట్ అవుతుంద‌న్న కాన్ఫిడెన్స్‌ని ఇటీవ‌ల ప్రీరిలీజ్ ఈవెంట్‌లో క‌న‌బ‌రిచాడు. ఇక‌పోతే ఆర్జీవీ సైతం ఆఫీస‌ర్ విష‌యంలో ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇక ఈ సినిమాకి తీవ్ర‌మైన పోటీ ఇవ్వ‌బోతున్న వేరొక చిత్రం అభిమ‌న్యుడు. విశాల్ న‌టించిన ఈ అనువాద చిత్రంలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఓ కీల‌క‌పాత్ర పోషించ‌డం ప్ర‌ధాన అస్సెట్ కానుంది. త‌మిళంలో ఇప్ప‌టికే ఇరుంబు తిరై పేరుతో రిలీజై విజ‌యం అందుకుంది. అక్క‌డ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అందుకే ఈ సినిమా ఠ‌ఫ్ కాంపిటీషన్ అని భావిస్తున్నారు.

ఇక ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ‌వుతున్న రాజుగాడు.. కంటెంట్ ప‌రంగా ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. రాజ్‌త‌రుణ్‌కి, డెబ్యూ డైరెక్ట‌ర్ సంజ‌న‌కు ఈ సినిమా విజ‌యం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ క్ర‌మంలోనే క‌సితో ఈ సినిమాని తీశార‌న్న టాక్ వినిపిస్తోంది. ఆఫీస‌ర్‌, రాజుగాడు చిత్రాల‌కు యుఎ స‌ర్టిఫికెట్ ద‌క్కింది. అభిమ‌న్యుడు క్లీన్ యు స‌ర్టిఫికెట్‌తో బ‌రిలో దిగాడు. ఈ ముక్కోణ‌పు పోటీలో విజేత ఎవ‌రో తేలాల్సి ఉందింకా. జూన్ 1 కీల‌క అంకం కాగా.. నేటి సాయంత్రం విశాల్ అభిమ‌న్యుడు చిత్రాన్ని ప్రివ్యూ వేస్తున్నారు. రేప‌టి ఉద‌యం ఆఫీస‌ర్, రాజుగాడు ప్రెస్ షోలు వేస్తున్నార‌ట‌. ఈ సినిమాల‌తో పాటు శ‌ర‌భ అనే వేరొక చిత్రం వ‌స్తున్నా ఇంత‌వ‌ర‌కూ అస్స‌లు ప్ర‌మోష‌న్ అన్న‌దే లేక‌పోవ‌డంతో లైట్ తీస్కున్నారంతా.

User Comments