`గేమ్ ఓవర్` మూవీ రివ్యూ

నటీనటులు: తాప్సీ, వినోదిని వైధ్య నాధన్, అనిష్ కురువిల్లా, సంచనా నటరాజన్, రమ్యసుబ్రహ్మణ్యన్ తదితరులు..
బ్యానర్: వైనాట్ స్టూడియోస్ – రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: శశికాంత్
సంగీతం: రఆన్ ఎథన్ యోహన్
రచన – దర్శకత్వం: అశ్విన్ శరవణన్

ముందు మాట:
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తాప్సీ మూడు ముక్కలాట ఆడుతోంది తాప్సీ. బాలీవుడ్లో బిజీగా కెరీర్‌ని కొనసాగిస్తున్న తాప్సీ `గేమ్ ఓవర్` సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో తాప్సీ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా చక్రాల కుర్చీకే అంకితమైన పాత్రలో నటించడం ఒక ఎగ్జైటింగ్ పాయింట్ అనుకుంటే..ఒక థ్రిల్లర్ కథాంశం ఆద్యంతం తన పాత్రతోనే నడిపించడం అన్నది మరో ఆసక్తికరమైన అంశం. `నా లైఫ్‌లో ఇప్పటి వరకు ఎలాంటి ఫ్రాక్చర్స్ జరగలేదు. అయితే ఈ చిత్రంలో మాత్రం రెండు కళ్లు కోల్పోయి చక్రాల కుర్చీకే పరిమితమైన యువతిగా ఇందులో నటించాను. 70 శాతం నేను వీల్ చైర్లో వుంటాను. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలెంజింగ్‌గా సాగుతుంది. యాక్సిడెంట్ జరిగిన సంవత్సరానికి మళ్లీ యానివర్సరీ రియాక్షన్ మొదలయ్యే ఒక ట్రోమా సమస్యతో బాధపడే పాత్రలో కనిపిస్తాను. ఆ యాక్సిడెంట్ ఏంటో తెరైనే చూడాలి` అని తాప్పీ వెలిపింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పించింది?. తాప్సీ పెట్టుకున్న అంచనాలను చేరువైందా? అశ్విన్ శరవణన్ ప్రయోగం ఫలించిందా? తెలియాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.

కథనం అనాలిసిస్:

స్వప్న(తాప్సీ) ఓ గేమ్ డెవలఆపర్. రెట్రో గోమ్స్ రూపొందించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటుంది. సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితం ఒక్కసారి న్యూ ఇయర్ సందర్భంగా జరిగిన భీకరమైన యాక్సిడెంట్ కారణంగా తలక్రిందులవుతుంది. ఆ తరువాత నుంచి తరచూ ఆ భీకర ప్రమాదపు సంఘటనలు స్వప్నను వెంబడిస్తుంటాయి. ఏడాదికి ఒకసారి సరిగ్గా అదే రోజు నైక్టోఫోబియా( అంధకార భీతి)కి గురవుతూ వుంటుంది. దాని నుంచి విచిత్రంగా ఓ టాటూ (పచ్చబొట్టు) స్వప్న బయటికి రావడానికి సహయపడుతూ వుంటుంది. చీకటి అంటే భయపడే స్వప్న జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది?. చీకట్లో ఆమెకు హాని చేస్తున్నదెవరు? చఈకట్లో తన చుట్టూ జరుగుతున్న భయంకర సంఘటనల నుంచి స్వప్న తనని తాను ఎలా కాపాడు కుంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
దర్శకుడు అశ్విన్ శరవణన్ తొలి భాగాన్ని మొత్తం తాప్సీ పాత్రని పరిచయం చేయడానికే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చాడు. స్వప్న చీకటి అంటే ఎందుకు భయపడుతోంది? తన ఇంటి ఆవరణ నుంచి బయటికి రావడానికి ఎందుకు భయపడుతోంది? తన ఇంళ్లే తనకు సురక్షితమైన ప్రాంతమని ఎందుకు భావిస్తోంది? ఆమెతో వుండే వినోదిని ఏం చేస్తోంది? వంటి వాటిపైనే తొలి భాగాన్ని ఎక్కువగా నడిపిస్తూ సస్పెన్స్‌ను మెయింటైన్ చేయడం ఆకట్టుకుంటుంది. ఒంటరి మహిళ ప్రపంచాన్ని చూసి భయపడుతోందని, అజ్ఞాత వ్యక్తులతో పోరాడేందుకు ధైర్యం చేయాలని చెప్పే ప్రయత్నం చేశారు.

నటీనటులు:
`పింక్` సినిమా సినిమా నుంచి తాప్సీ సినిమాల ఎంపిక మారింది. రొటీన్ కథల్ని కాకుండా కొత్త తరహా చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యత నిస్తూ వస్తోంది. అలా చేసిన చిత్రాలు తాప్సీకి నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి కూడా. నటిగా తన సత్తా ఏంటో నిరూపిస్తున్నాయి. దాంతో తాప్సీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఆ కోవలో చేసిన చిత్రమే `గేమ్ ఓవర్`. ఈ సినిమా ఆద్యంతం తాప్సీపైనే ఆధారపడి నడిచే కథాంశం కావడంతో తాప్సీకి నటించే స్కోప్ ఎక్కువగా లభించింది. ప్రతీ సన్నివేశంలో తాప్సీ తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఒక విధంగా చెప్పాలంటే `గేమ్ ఓవర్` తాప్సీ వన్ ఉమెన్ షో. ఇక మిగతా పాత్రల్లో నటించిన వినోదిని వైధ్య నాధన్, అనిష్ కురువిల్లా, సంచనా నటరాజన్, రమ్యసుబ్రహ్మణ్యన్ తమ తమ పాత్రల పరిథిమేరకు నటించి పూర్తిగా న్యాయం చేశారు.

టెక్నికాలిటీస్:
ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలకు కీలక భూమిక పోషించేది సినిమాటోగ్రఫీ. ఈ సినిమాకు ఏ వసంత్ అందించిన ఫొటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డార్క్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని వసంత్ తన ఫొటోగ్రఫీతో మరింత ఆసక్తికరంగా మలిచాడని చెప్పొచ్చు. రోన్ ఎతాన్ యోహన్ తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాకు వెన్నముకగా నిలిచి ప్రేక్షకుడు సినిమాలో లీనమయ్యేలా చేయడం నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ బాగున్నా నిడివి మరింత పెంచితే బాగుండేది. నిడివి తగ్గించడంతో సన్నివేశాల్ని అర్థం చేసుకోవడంలో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా వుంది.దాంతో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు అన్నది ఎవరికీ ఎక్కదు. అర్థం కాదు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని వుంటే గేమ్ ఓవర్ మరింతగా ఆకట్టుకునే అవకాశం వుంది. ఈ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని వుంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్:

రెగ్యులర్ థ్రిల్లర్ కథాంశంతో కాకుండా అవుటాఫ్ ద బాక్స్ స్టోరీని తీసుకుని దర్శకుడు ఎంగేజింగ్‌గా చెప్పిన విధానం బాగుంది. తాప్సీ నటన, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. రోన్ ఎతాన్ యోహన్ నేపథ్య సంగీతం, ఏ వసంత్ అందించిన ఫొటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి.

మైనస్ పాయింట్స్:

ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్‌కి నిడివి చాలా ముఖ్యం. ఈ సినిమా రన్ టైమ్ గంటా 43 నిమిషాలు మాత్రమే. ఇదే ఈ చిత్రానికి పెద్ద డ్రాబ్యాక్. ఈ సినిమా నిడివిని మిరింత పెంచాల్సింది అనిపించింది. లెంగ్త్ పెంచితే సినిమా మరింత ప్రభావం చూపించే అవకాశం వుంది. దర్శకుడు ఆ విషయంలో శ్రద్ధ పెట్టాల్సింది. అలా చేయకపోవడం వల్ల సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఏం జరుగుతుందో కొంత క్లారిటీ మిస్సయింది. పాత్రల పరంగా తాప్సీ, అనీష్ కురువిల్లా తప్ప తెలిసిన ముఖం సినిమా మొత్తం వెతికినా ఒకటీ కనిపించదు.

ముగింపు:
ఒకే పాత్ర నేపథ్యంలో సినిమాని నడిపించడం ఒక విధంగా చెప్పాలంటే సాహసమే. థ్రిల్లర్ ఎంటర్టైనర్కి నిడివి ఎంత తక్కువగా వుంటే అంత మంచిది కానీ ఈ సినిమాకు అదే ప్రధానం. ఓవరాల్‌గా చెప్పాలంటే గేమ్ థీమ్‌ని తీసుకుని తొలి ప్రయత్నంగా అశ్విన్ శరవణన్ చేసిన ప్రయోగం అని చెప్పాలి. నిడివి విషయంలో మిరన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే అవుటాఫ్ ద బాక్స్ సినిమాగా నిలిచే అవకాశం వుంది.

రేటింగ్: 3.5/5

Also ReadTaapsee’s Game Over Censored