గ్యాంగ్ లీడ‌ర్ ఫిలింన‌గ‌ర్ టాక్

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్ ఈనెల 13న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌నం లాంటి క్లాసిక్ హిట్ త‌ర్వాత 24, హ‌లో చిత్రాల్ని తెర‌కెక్కించిన విక్ర‌మ్.కె ఆశించిన హిట్టివ్వ‌డంలో త‌డ‌బ‌డ్డాడు. క్లాసిక్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు ద‌క్కినా బాక్సాఫీస్ స‌క్సెస్ లేక‌పోవ‌డం అత‌డికి మైన‌స్ గా మారింది. ఇలాంటి టైమ్ లో ల‌క్కీ ఛామ్ నాని హీరోగా అత‌డు గ్యాంగ్ లీడ‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. జెర్సీ రూపంలో నానికి హిట్టు ద‌క్కినా ఈసారి ఆ స‌క్సెస్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తాడా లేదా? అన్న‌ది స‌స్పెన్స్. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కీల‌క స‌మాచారం అందింది. `సాహో` ఫిలింన‌గ‌ర్ టాక్ నిజ‌మైంది. ఆ త‌ర్వాత‌.. మై ఫ‌స్ట్ షో ఎక్స్ క్లూజివ్ ఫిలింన‌గ‌ర్ టాక్ ఇది.

గ్యాంగ్ లీడ‌ర్ క‌థ‌ ఓ బ్యాంక్ దొంగ‌త‌నంతో ఓపెన్ అవుతుంది. ఐదుగురు దొంగ‌లు బ్యాంక్ కి క‌న్నం వేసి కార్ లో త‌ప్పించుకుని పారిపోతుంటే గ‌న్ షూటింగ్ లో చ‌నిపోతారు. ఆ క్ర‌మంలోనే ఆ ఐదుగురికి బంధువులు అయిన మ‌రో ఐదుగురు మ‌హిళ‌లు బ‌రిలోకి దిగుతారు. ఆ ఐదుగురిలో వృద్ధురాలు అయిన ల‌క్ష్మి తాను చ‌దివిన న‌వ‌ల‌లోలానే ఈ మ‌ర్డ‌ర్ ఉండ‌డంతో అస‌లేం జ‌రిగిందో క‌నిపెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఆ పుస్త‌కం రాసింది ఇంకెవ‌రో కాదు.. ఫిలిం ర‌చ‌యిత నాని. ఆ త‌ర్వాత ఏదోలా అత‌డి వెంట ప‌డి త‌మ రివెంజ్ తీర్చుకునేందుకు సాయం కోర‌తారు ఆ ఐదుగురు. రైట‌ర్ గా నానికి ఉన్న నాలెజ్ దృష్ట్యా అత‌డు త‌ర్వాత ఏం జ‌ర‌గ‌బోతోంది అన్న కోయిన్సిడెన్స్ ఘ‌ట‌న‌ల్ని తెలుసుకోగ‌లుగుతాడు. అలా ఆర్.ఎక్స్ 100 కార్తికేయ సీన్ లోకి ఎంట‌ర‌వుతాడు. అత‌డే ఆ నేర‌స్తుడు అన్న‌ది ఐదుగురితో పాటు నాని పాయింట్ ఆఫ్ వ్యూ. కార్తికేయ‌ను ప‌ట్టుకుంటారు వీళ్లంతా. అయితే అస‌లైన ట్విస్టు ఇక్క‌డే ఉంది. అసలు కార్తికేయ‌నే ఆ నేరం చేశాడా? ఆ ఐదుగురిని చంపింది ఎవ‌రు? ఈ క‌థ‌లో ఎంట‌ర‌య్యే రెండో నాని క‌థేంటి? అస‌లు ఎవ‌రు చంపారు? అన్న‌ది బ్యాలెన్స్ స్టోరి. టీజ‌ర్ లో ఫ‌న్ ఎలిమెంట్ క‌నిపించింది. కానీ `గ్యాంగ్ లీడ‌ర్` చిత్రం బిలో యావ‌రేజ్ అని తేలింది. ముఖ్యంగా సెకండాఫ్ క‌థాంశం వీక్. నాని న‌ట‌న ఆద్యంతం హైలైట్ గా ఉంటుంది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితం అందుకోనుంది? ఈ ఫిలింన‌గ‌ర్ టాక్ తో సంబంధం లేకుండా ఆడుతుందా లేదా? అన్న‌ది వేచి చూడాలి.