గ‌రుడ‌వేగ‌.. రాజ‌శేఖ‌ర్ గుర్తు చేస్తున్నాడు..

Last Updated on by

రాజ‌శేఖ‌ర్ సినిమాకు ఈ మ‌ధ్య కాలంలో క‌నీసం 4 కోట్లు కూడా రాలేదు. అస‌లు గ‌డ్డం గ్యాంగ్ అనే సినిమా అయితే ఎప్పుడొచ్చి.. ఎలా వెళ్లిపోయిందో కూడా తెలియ‌దు. అంత దారుణ‌మైన ఫ్లాప్ అది. ఇలాంటి టైమ్ లో ఆయ‌న ఏ సినిమా చేసినా కూడా ప్రేక్ష‌కులు ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో లేరు. గ‌రుడ‌వేగ కూడా దీనికి మిన‌హాయింపు కాదు. ఈ చిత్రంపై గ‌త సినిమాల‌తో పోలిస్తే ఆస‌క్తి బాగానే ఉన్నా.. క‌లెక్ష‌న్లు మాత్రం ముందు ఊహించినంత లేవు. తొలిరోజు ఈ చిత్రం కేవ‌లం కోటిన్న‌ర షేర్ తో స‌రిపెట్టుకోగా.. రెండోరోజు 2 కోట్ల‌కు పైగా షేర్ సాధించింది. ఇక మూడో రోజు ఆదివారం అయితే 3 కోట్ల వ‌ర‌కు షేర్ సాధించిన‌ట్లు తెలుస్తోంది. దీన్నిబ‌ట్టి సినిమా టాక్ ప్రేక్ష‌కుల్లోకి వెళ్ల‌డం.. రాజ‌శేఖ‌ర్ ను చూడ్డానికి వాళ్లు థియేట‌ర్స్ కు రావ‌డం జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది.

ఓవ‌ర్సీస్ లో అయితే ఇప్ప‌టికే సేఫ్ జోన్ లోకి వ‌చ్చేసారు బ‌య్య‌ర్లు. అక్క‌డ ఇప్ప‌టికే 2 ల‌క్ష‌ల 80 వేల డాల‌ర్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. షేర్ కూడా కోటి దాటేసింది. అక్క‌డ ఈ చిత్రాన్ని ల‌క్ష‌ల్లోనే కొన్నారు. అంటే మూడు రోజుల్లోనే విదేశీ మార్కెట్ లో గ‌రుడ‌వేగ సేఫ్ అయింది. అయితే ఇక్క‌డ మాత్రం ఇంకా చాలా దూరం ప్ర‌యాణించాలి ఈ చిత్రం. గ‌రుడ‌వేగ తెలుగు రాష్ట్రాల్లో సేఫ్ అవ్వాలంటే క‌నీసం 15 కోట్లు రావాలి.

సొంతంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేసుకున్నాడు రాజ‌శేఖ‌ర్. ఇదే ఈయ‌న‌కు క‌లిసొచ్చేలా క‌నిపిస్తుంది. బ‌య్య‌ర్లు న‌ష్ట‌పోతార‌న్న బెంగ లేదు. వ‌చ్చిన వ‌ర‌కు క‌లెక్ష‌న్లు రావ‌డం ఖాయం. ఆ త‌ర్వాత శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్ రూపంలో క‌నీసం 10 కోట్ల వ‌ర‌కు వ‌స్తాయ‌ని న‌మ్ముతున్నారు చిత్ర‌యూనిట్. ఇప్ప‌టికే హిందీ నుంచి ఫ్యాన్సీ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒక్క సినిమాతో రాజ‌శేఖ‌ర్ ఈజ్ బ్యాక్ అనిపించాడు. ఈ వారం వ‌ర‌కు దూకుడు ఇదే కొన‌సాగితే గ‌రుడ‌వేగ‌పై ఆయ‌న పెట్టుకున్న న‌మ్మ‌కంతో పాటు డ‌బ్బులు కూడా వెన‌క్కి వ‌స్తాయి.

User Comments