గ‌రుడ‌వేగ.. చివ‌రికి ప‌రిస్ధితేంటి..?

ఈ ఏడాది మోస్ట్ సర్ ప్రైజింగ్ సినిమాల్లో గ‌రుడ‌వేగ కూడా ఒక‌టి. ఈ చిత్రం వ‌స్తుంద‌నే విష‌య‌మే చాలా మందికి టీజ‌ర్ విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు కూడా తెలియ‌దు. ఇక ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ఆస‌క్తి మొద‌లైంది. విడుద‌లైన త‌ర్వాత టాక్ బాగా వ‌చ్చింది. కానీ ఊహించిన వ‌సూళ్లు మాత్రం రాలేదు. ఈ రోజుల్లో సినిమా ఎంత బాగున్నా కూడా క‌లెక్ష‌న్లు వారం కాగానే త‌గ్గుముఖం ప‌డుతుంటాయి. దానికి పైర‌సీతో పాటు వారం త‌ర్వాత కొత్త సినిమాలు రావ‌డం కార‌ణం. గ‌రుడ‌వేగ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈ చిత్రానికి టాక్ బాగుంది.. క‌లెక్ష‌న్లు ఊహించ‌నంత రాలేదు. కానీ రాజ‌శేఖ‌ర్ ఇప్పుడు ఉన్న ఇమేజ్ తో పోలిస్తే గ‌రుడ‌వేగ‌కు ఎక్కువ‌గా వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లే.


గ‌రుడ‌వేగ‌ ఇప్ప‌టి వ‌ర‌కు 7.25 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఈ మ‌ధ్య కాలంలో రాజ‌శేఖ‌ర్ సినిమాల‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ‌. కానీ గ‌రుడ‌వేగ సేఫ్ అవ్వాలంటే 12 కోట్ల‌కు పైగా రావాలి. బ‌డ్జెట్ అంత‌కంటే ఎక్కువ‌గా ఉన్నా.. నిర్మాత‌లే త‌క్కువ‌కు బిజినెస్ చేసారు. రాజ‌శేఖ‌ర్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని చూస్తే గ‌రుడ‌వేగ‌కు అన్ని కోట్లు రావ‌డం మాత్రం క‌ష్ట‌మే. కానీ క‌మ‌ర్షియ‌ల్ గా సేఫ్ అయినా కాక‌పోయినా ఇది ప‌క్కా రాజ‌శేఖ‌ర్ కు క‌మ్ బ్యాక్ సినిమానే. అయితే థియేట్రికల్ క‌లెక్ష‌న్లు త‌క్కువ‌గా వ‌చ్చినా కూడా శాటిలైట్, డ‌బ్బింగ్, డిజిట‌ల్ రైట్స్ పై ఈ చిత్ర నిర్మాత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. ఇప్ప‌టికే హిందీ రైట్స్ 5 కోట్లు ప‌లికాయ‌నే వార్త‌లు వ‌చ్చాయి. క‌లెక్ష‌న్లు ఇంకా స‌గం రావాలి. ప‌రిస్థితి చూస్తుంటే ఇంకా సినిమాకు క‌లెక్ష‌న్లు రావ‌డం గ‌గ‌నమే. ఇప్ప‌టికైతే ఆప‌రేష‌న్ స‌క్సెస్.. పేషెంట్ డెడ్ అన్న‌ట్లుంది ఈ చిత్రం ప‌రిస్థితి. మ‌రి చివ‌రి వ‌ర‌కైనా రాజ‌శేఖ‌ర్ ప‌డిన క‌ష్టానికి ఫ‌లితం రావాల‌ని కోరుకుందాం..!