గ‌రుడ‌వేగ అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్.. కానీ ఇక్క‌డ‌..?

విడుద‌లైన‌ప్పుడు క‌నీసం ఎవ‌రూ ఊహించ‌లేదు.. అస‌లు అనుకోలేదు కూడా గ‌రుడ‌వేగ క‌నీస వ‌సూళ్లైనా సాధిస్తుందేమో అని. కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు అయ్యాయి. ఈ చిత్రం ఓవ‌ర్సీస్ లో ఊహించ‌ని బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. అక్క‌డ దాదాపుగా 30 ల‌క్ష‌ల‌కు మాత్రమే ఈ చిత్ర రైట్స్ తీసుకున్నారు కానీ కోటిన్న‌ర‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది ఔరా అనిపించింది. అస‌లు రాజ‌శేఖ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఓవ‌ర్సీస్ లో ఒక్క సినిమా విడుద‌ల చేయ‌లేదు. ఫ‌స్ట్ టైమ్ ఆయ‌న మార్కెట్ అక్క‌డ ఓపెన్ అయింది. గ‌రుడ‌వేగ అక్కడ 5 ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేసింది. అంటే అక్ష‌రాలా 3.5 కోట్లు అన్న‌మాట‌. షేర్ లెక్కేస్తే కోటిన్న‌ర వ‌ర‌కు ఉంది.
Garugavega overseas collections good
హాలీవుడ్ రేంజ్ లో యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఉండ‌టం.. ప్ర‌వీణ్ స‌త్తార్ స్క్రీన్ ప్లే ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల‌కు బాగానే న‌చ్చింది. అక్క‌డి డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు మూడింతల లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఊహించినంత వ‌సూళ్లు తీసుకురాలేదు గ‌రుడ‌వేగ‌. ఇక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 5 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. బ్లాక్ బ‌స్టర్ టాక్ వ‌చ్చినా కూడా వ‌సూళ్లు మాత్రం ఫ్లాప్ సినిమాకు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చాయి. అది రాజ‌శేఖ‌ర్ కు ఇప్పుడు ఉన్న ఇమేజ్ కార‌ణం అయి ఉండొచ్చు. మొత్తానికి ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాలంటారు.. కానీ ర‌చ్చ గెలిచి ఇంట గెల‌వ‌డం మాత్రం మ‌రిచిపోయాడు రాజ‌శేఖ‌ర్.