పాపం గోపీచంద్ కు ఏమైంది..

గోపీచంద్.. మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న గోపీచంద్ వరస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు.  లౌక్యం తరువాత గోపీచంద్ కు హిట్ లేదు. పైగా ఆరడుగుల బుల్లెట్, ఆక్సిజన్ సినిమాలు విడుదల కాకముందే ఆగిపోయాయి. ఇదొక మైనస్.  అయితే, ఇటీవలే గౌతమ్ నందా సినిమా విడుదలయింది. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అనుకున్నారు.  కానీ, అంచనాలు తారుమారయ్యాయి.
సినిమా మంచి టాక్ వచ్చినా.. ఫస్ట్ డే ఓపెనింగ్స్ మాత్రం పెద్దగా లేవు.  మొదటిరోజు కేవలం మూడున్నర కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న వ్యక్తికీ ఇది పెద్ద వసూళ్లు కాదు. ఇప్పటికే రెండు ప్రాజెక్టులు ఆగిపోవడంతో.. ఇబ్బందులు పడుతున్న గోపిచంద్ కు ఈ సినిమా వసూళ్ల పరంగా డీలా పడటంతో.. గోపీచంద్ పరిస్థితి ఏమిటి.. ఎలా ఉంటుంది అన్నది డైలమాలో పడింది.  మరి గోపీచంద్ మరలా నిలదొక్కుకుంటారా లేదంటే.. కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని మరలా ఎంట్రీ ఇస్తారో చూడాలి. అయితే, చేతిలో ఎలాగూ ఆరడుగుల బుల్లెట్, ఆక్సిజన్ సినిమాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెంలో పర్లేదు. ఎలాగోలా కష్టాలు గట్టెక్కి అవి రిలీజై.. ఏ ఒక్కటి హిట్ అయినా గోపీచంద్ ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ, అవి కూడా షరా మామూలే అంటే మాత్రం, తర్వాత డ్యామేజ్ మామూలుగా ఉండదనే అనిపిస్తోంది.