కేర‌ళ‌కే గీత సొమ్ములన్నీ

Last Updated on by

కేర‌ళ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ప్ర‌జా జీవ‌నం అత‌లాకుత‌ల‌మై, వేలాదిగా ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. అలాంటి వారికి సినీప్ర‌ముఖుల నుంచి పెద్ద ఎత్తున సాయం అంద‌డం కొంత‌లో కొంత ఊర‌ట‌. ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్‌హాస‌న్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, సూర్య‌, కార్తీ కేర‌ళ‌కు భారీ మొత్తాల్ని డొనేట్ చేశారు. ప్ర‌భాస్ ఏకంగా కోటి డొనేష‌న్ ప్ర‌క‌టించి షాకిచ్చాడు.

ఇప్పుడు `గీత గోవిందం` నిర్మాత బ‌న్ని వాసు త‌న డొనేష‌న్ ప్ర‌క‌టించి స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. `గీత గోవిందం` కేర‌ళ వ‌సూళ్లు అన్నీ ఆ రాష్ట్రానికే ఇచ్చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ బుధ‌వారం రిలీజైన గీత గోవిందం తొలిరోజే 65 శాతం మేర రిక‌వ‌రీ సాధించింద‌న్న రిపోర్ట్ అందింది. ప్రివ్యూల రూపంలోనే అమెరికాలో హాఫ్ మిలియ‌న్ డాలర్ క‌లెక్ట్ చేసింది. ఐదు రోజుల్లో ఈ సినిమా 25 కోట్ల షేర్ వ‌సూలు చేస్తుంద‌ని, 40 కోట్ల క్ల‌బ్‌లో చేరుతుంద‌ని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. గీత గోవిందం బ్లాక్‌బ‌స్ట‌ర్ అన్న టాక్‌తో ఇంటా బ‌య‌టా దుమ్ము దులిపేస్తోంది. ఈ విజ‌యాన్ని విజ‌య్ ఓ రేంజులో సెల‌బ్రేట్ చేసుకుంటున్నాడు.

User Comments