దేవ‌ర‌కొండ‌కు బ‌న్ని అండ‌

Last Updated on by

నైజాం నుంచి స్పీడ్‌గా దూసుకొచ్చిన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ హైద‌రాబాదీ బోయ్ త‌న సామ్రాజ్యాన్ని వేగంగా విస్త‌రిస్తున్నాడు. అత‌డు నిర్మాత‌ల పాలిట కామ‌ధేనువుగా మారాడు. దేవ‌ర‌కొండ ఎంపిక‌లే అత‌డిని గెలిపిస్తున్నాయ‌న్న కాన్ఫిడెన్స్ ట్రేడ్ వ‌ర్గాల్లో ఉందిప్పుడు. అందుకే అత‌డి కోసం బ‌డా నిర్మాణ సంస్థ‌లు క్యూలో ఉంటున్నాయి. అర్జున్‌రెడ్డితో బంప‌ర్ హిట్ కొట్టాడు అన‌గానే గీతా ఆర్ట్స్‌, మైత్రి మూవీస్‌ వంటి సంస్థ‌లే క‌ర్చీఫ్ వేసేశాయి. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ -2 బ్యాన‌ర్ నిర్మిస్తున్న `గీత గోవిందం`, మైత్రి మూవీస్‌ నిర్మిస్తున్న `డియ‌ర్ కామ్రేడ్‌`, మ‌రో సినిమా ట్యాక్సీ వాలా.. అంత‌కంత‌కు వేడి పెంచుతున్నాయి.

ఇక‌పోతే `గీత‌గోవిందం` చిత్రం రిలీజ్ బ‌రిలోకి దిగ‌డంతో జీఏ2 సంస్థ ప్ర‌మోష‌న్స్‌లో వేగం పెంచింది. ఈనెల 29న ఆడియో ఈవెంట్‌ని ఘ‌నంగా ప్లాన్ చేశారు. ఈ ఆడియోలో ముఖ్య అతిధిగా స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ కానున్నారు. ఈ వేదిక‌పై దేవర‌కొండ‌కు, త‌మ కంపెనీ అయిన జీఏ2కి బూస్ట్ ఇచ్చేందుకు బ‌న్ని విచ్చేస్తున్నాడు. తాజాగా గీత‌గోవిందం ఆడియో ఈవెంట్ పోస్ట‌ర్‌పై బ‌న్ని ఫోటోని ముద్రించి అభిమానుల్లో హీట్ పెంచారు. ఇక దేవ‌ర‌కొండ‌కు బ‌న్ని ఫ్యాన్స్ అండాదండా త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది అన్న తీరుగా ఈ పోస్ట‌ర్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అంటే ఏపీ, నైజాంలో దేవ‌ర‌కొండ‌ను బ‌న్ని అభిమానులే మోస్తార‌న్న సింబాలిజం క‌నిపిస్తోంది. ఒక‌వేళ అదే నిజ‌మైతే, దేవ‌ర‌కొండ‌కు జాక్‌పాట్ త‌గిలిన‌ట్టే.

User Comments