గీత గోవిందం` 50కోట్ల క్ల‌బ్‌లోకి

రిలీజైన అన్నిచోట్లా గీత గోవిందం హ‌వా సాగుతోంది. ఆంధ్రా, తెలంగాణ‌, సీడెడ్‌, నైజాం, ఓవ‌ర్సీస్‌, బెంగ‌ళూరు, చెన్న‌య్ ఇలా కాదేదీ వ‌సూళ్ల క‌న‌ర్హం అన్న చందంగా ఈ సినిమా హ‌వా సాగిస్తోంది. అలా ఇప్ప‌టికే 34 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇంకా ఇంకా అదే దూకుడు కొన‌సాగిస్తూ 50 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల దిశ‌గా సాగిపోతోంది.

ఏరియా వైజ్ ప‌రిశీలిస్తే ఈ సినిమా ఏపీలో 8.80 కోట్లు, నైజాంలో 8.70కోట్లు, సీడెడ్‌ 3 కోట్లు వ‌సూలు చేసింది. ఓవ‌రాల్‌గా ఏపీ, నైజాం క‌లుపుకుని 21కోట్లు వ‌సూలైంది. అమెరికా నుంచి 7కోట్ల గ్రాస్ వ‌సూలైంది. క‌ర్నాట‌క ఇత‌ర ఇండియా వ‌సూళ్లు క‌లుపుకుని మొత్తంగా 34కోట్ల గ్రాస్ లెక్క‌లు తేలాయి. ఇక మ‌రో వారం రెండు వారాల్లోనే 50 కోట్ల గ్రాస్ వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇందులో 20 కోట్ల షేర్ వ‌సూళ్లు ద‌క్కాయి.. అంటే ఇప్ప‌టికే డిస్ట్రిబ్యూట‌ర్లు లాభాల పంట పండించుకుంటున్నార‌న్న మాట‌!

User Comments