దిల్‌రాజుకు గీత కొట్టే దెబ్బ‌!

Last Updated on by

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు ఎన్నో హోప్స్ పెట్టుకున్న `శ్రీ‌నివాస‌క‌ళ్యాణం` చిత్రానికి ఊహించ‌ని పంచ్ ప‌డింది. ఈ సినిమా ఓ పెళ్లి డాక్యుమెంట‌రీ లాంటిది. పెళ్లి సినిమాల్లోనే డిజాస్ట‌ర్! అన్న టాక్ తొలి రోజు ప్రివ్యూల నుంచే లీక‌వ్వ‌డంతో ఊహించ‌ని రీతిలో షాక్ తిన్నారు. నితిన్, రాశీ ఖ‌న్నా జంట ఆశ‌ల్ని అడియాస‌లు చేసింది ఈ సినిమా. అయితే ఈ విష‌యాన్ని చాలా ముందే గ్ర‌హించిన దిల్‌రాజు ప్ర‌క‌ట‌న‌ల ఖ‌ర్చు మొత్తం కోసేసి మీడియాకి ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌లేద‌న్న వాద‌నను ఓ ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక వ్య‌క్తం చేసింది. ఫ్లాప‌వుతుంద‌నే తెలిసే దిల్‌రాజు అలా చేశారా? అంటూ ప్ర‌శ్నించింది ఆ క‌థ‌నం.

అందుకు త‌గ్గ‌ట్టే.. సోమ‌వారం నాటికి ఈ సినిమా థియేట‌ర్లు పూర్తిగా ఖాళీ అయిపోయాయ‌ని తెలుస్తోంది. ఇక ఎలానూ ఈ శుక్ర‌వారం అత్యంత క్రేజీగా `గీత గోవిందం` రిలీజైపోతోంది కాబ‌ట్టి, క‌ళ్యాణం ఆ మేర‌కు పూర్తిగా ఖాళీ అయిపోవ‌డం ఖాయ‌మ‌న్న మాటా వినిపిస్తోంది. ఇప్ప‌టికే దేవ‌ర‌కొండ‌- ర‌శ్మిక జోడీకి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా `గీత గోవిందం`పై హైప్ అంత‌కంత‌కు రెట్టింపైంది. రీసెంటుగా లీకైన లిప్ లాక్ ఎపిసోడ్ ఈ సినిమాకి పెద్ద ఎత్తున క‌లిసి రానుంది. యువ‌త‌రాన్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డానికి ఇది సాయ‌మ‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మొత్తానికి ర‌శ్మిక రెయిజ్ రాశీకి డౌన్ ఫాల్ అన్న చందంగా సీన్ ఛేంజ్ అయ్యింద‌న్న‌మాట‌. 14వ తేదీ సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాలు స‌హా అమెరికాలో గీత గోవిందం ప్రీమియ‌ర్లు ప్రారంభం కానుండ‌డంతో చాలా ముందే దేవ‌ర‌కొండ అభిమానుల్లో సంద‌డి నెల‌కొంది.

User Comments