అల్ల‌రి హాసిని రీఎంట్రీ

Last Updated on by

అల్ల‌రి హాసినిగా తెలుగింటి లోగిళ్ల‌లో జెనీలియా చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. బోయ్స్ సినిమా మొద‌లు జెనీలియా సౌత్ స్టార్ గా ఎదిగిన తీరు ఆస‌క్తిక‌రం. చురుకైన వ్య‌క్తిత్వం, తెలివితేట‌లు, అమాయ‌క‌మైన మోముతో తెలుగు యువ‌త‌ను స్పెల్ బౌండ్ చేసేసింది. ఒకే ఒక్క బొమ్మ‌రిల్లు ఈ అమ్మ‌డికి తెలుగు లోగిళ్ల‌లో గొప్ప పేరు తెచ్చి పెట్టింది. బొమ్మ‌రిల్లు హాసినిగా గుండెల్లో స్థిర‌ప‌డింది. ఆ త‌ర్వాత ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల్లో చ‌క్క‌ని ఆహార్యంతో మైమ‌రిపించింది. అటుపై బాలీవుడ్‌లో న‌టించి మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ కొడుకు రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లాడింది. ప్ర‌స్తుతం ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

వ్య‌క్తిగ‌త జీవితంలో ప్రాధాన్య‌త వ‌ల్ల కెరీర్‌ జ‌ర్నీలో కొంత గ్యాప్ వ‌చ్చింది. మ‌ళ్లీ ఇంత‌కాలానికి జెనీలియా తిరిగి రీఎంట్రీ ఇస్తోందని స‌మాచారం. జెనీలియా గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంద‌ట‌. అయితే పెళ్ల‌య్యాక ఈ అమ్మ‌డు తిరిగి ఐశ్వ‌ర్యారాయ్ త‌ర‌హాలో క‌థానాయిక అవుతుందా? లేక అమ్మ‌, అక్క‌, వ‌దిన పాత్ర‌ల‌కు ప‌రిమిత‌మ‌వుతుందా? అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేం. ప్ర‌స్తుతం త‌న లుక్ ఛేంజ్ కోసం తీవ్రంగానే శ్ర‌మిస్తోంద‌ట‌. క‌ష్టేఫ‌లి అన్నారు పెద్ద‌లు. ఇప్ప‌టికైతే లుక్ ఛేంజ్ చేస్తోంది. టాలీవుడ్‌లో త‌న స్నేహితులంద‌రి నుంచి ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఫీల‌ర్స్ పంపే ప‌నిలో ఉంద‌ట‌. చూద్దాం.. ముందుగా ఈ అల్ల‌రి హాసినికి ఎవ‌రు ఛానిస్తారో. అయినా అల్ల‌రి పోయి బుద్ధిమంతురాలిగా మారిపోయింది కాబ‌ట్టి ఈసారి బుద్ధిమంతురాలైన పాత్ర‌ల్లోనే ఛాన్సొస్తుందేమో?

User Comments