మ‌ట్టిలో పుట్టిన 2000కోట్ల హీరో!

Last Updated on by

ఆయ‌న ట‌చ్ మామూలు ట‌చ్ కాదు. మిడాస్ ట‌చ్‌.. మ‌ట్టి కూడా బంగారం అయిపోతుంది. ఆయ‌న ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. ఆయ‌నేం చేసినా కాసుల పేరులా.. ఖ‌రీదు క‌ట్ట‌లేని.. ఆభ‌ర‌ణంగా మారుతుంది. కాస్త మాసీగా చెప్పాలంటే బాక్సాఫీస్ వ‌ద్ద కుంభ‌వృష్టికి కేరాఫ్ అడ్రెస్ అత‌డు. అందుకే ఆయ‌న్ని మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అనీ అన్నారు. పెర్ఫెక్ష‌నిజం ఆయ‌న న‌డ‌క‌-న‌డ‌తలోనే ఉంది. బిజినెస్ ఆయ‌న న‌డ‌వ‌డిక‌లోనే ఉంది. అందుకే వేల కోట్లు కురుస్తున్నాయ్. ఆయ‌న ఒక్క‌సారి మేక‌ప్ వేసుకుని సెట్స్‌కి వెళ్లాడంటే క‌ళ అంతు చూడాల్సిందే. క‌డుపు నింపేది క‌ళ అని ఎవ‌ర‌న్నారు? కోట్ల‌కు కోట్లు దోచిపెట్టి రాజ‌సం తెచ్చేది క‌ళ‌! స్వ‌ర్గ‌సౌఖ్యాల్ని అందించేది క‌ల‌!! అని నిరూపించిన మేటి ఘ‌నుడు. ఆయ‌నే అమీర్‌ఖాన్‌. ది లెజెండ్‌! ది గ్రేట్ వారియ‌ర్‌.. ఇండియ‌న్ సినిమా టైకూన్‌.

ఒక్క `దంగ‌ల్‌` సినిమాతో వ‌ర‌ల్డ్‌వైడ్ 25000 కోట్లు వ‌సూలు చేశాడు. కేవ‌లం చైనా నుంచి 1200 కోట్లు తెచ్చింది దంగల్‌. ఇప్పుడు చైనీయులు అమీర్ అంకుల్ అంటూ వెంట‌ప‌డేంత పాలోయింగ్ తెచ్చుకున్నాడు. అలాంటి మేరున‌గ‌ధీరుడు .. ఇప్పుడు గ‌జ‌దొంగ అవ‌తారంలో ప్రేక్ష‌కాభిమానుల ముందుకు రాబోతున్నాడు. అరివీర‌భ‌యంక‌ర విన్యాసాల్ని తెర‌పై చూపించిబోతున్నాడు. అమీర్‌ఖాన్ న‌టిస్తున్న `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌` శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతోంది. 2018 మోస్ట్ అవైటెడ్ మూవీ ఇదేన‌న‌డంలో సందేహం లేదు. అప్పుడ‌ప్పుడు ఛేంజ్ కోసం ఇలా మారుతుంటాడు అమీర్‌. ఈసారి మాత్రం మ‌ట్టిలో మాణిక్యంలా మారాడు. ఈ కూలిప‌నిలో అమీర్‌తో పాటు ఆలియా సైతం పోటీప‌డుతూ త‌ట్ట‌లోకి మ‌ట్టి ఎత్తుతోంది. అమీర్ ఇలా త‌వ్వ‌కాలు చేప‌డుతూ మ‌ట్టిని గాల్లోకి గిరాటేస్తుండ‌డం చూసి, ఇంత‌కీ ఏదైనా నిధి కోసం త‌వ్వుతున్నారా? అంటే అదేం కాదు. నిన్న‌టిరోజున మేడే సంద‌ర్భంగా ఇలా కార్మిక అవ‌తారం ఎత్తారంతే!

User Comments