జార్జిరెడ్డి ఫిల్మ్ న‌గ‌ర్ టాక్

George Reddy Telugu Movie Review & Rating

ఇటీవ‌ల నిరంత‌ర‌ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన చిత్రం జార్జిరెడ్డి. ఉస్మానియా విద్యార్ధి నాయ‌కుడు, ఫిజిక్స్ గోల్డ్ మెడ‌లిస్ట్ జార్జిరెడ్డి బ‌యోపిక్ ఆధారంగా తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో మంచి హైప్ క్రియేట్ అయింది. టాలీవుడ్ ప్ర‌ముఖుల స‌హా ట్రైల‌ర్ ను మెచ్చ‌డంతో సినిమాలో విష‌యం ఉన్న సినిమాగా ప‌బ్లిక్  లోకి దూసుకుపోయింది. మెగా బ్ర‌ద‌ర్స్ ముగ్గురు జార్జిరెడ్డిపై చూపించిన ఆస‌క్తి నేప‌థ్యంలో అంచ‌నాలు మ‌రింత రెట్టింపు అయ్యాయి. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని శుక్ర‌వారం సినిమా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ఫిల్మ్ న‌గ‌ర్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

జార్జిరెడ్డి ప్రథ‌మార్థం డీసెంట్ గా సాగుతుంది. ఉస్మానియా  యూనివ‌ర్శీటి  బ్యాక్ డ్రాప్ స్టోరీ కాబ‌ట్టి సినిమా ఎక్కువ‌గా భాగం యూనివర్శీటి చుట్టూనే తిరుగుతుంది. కాలేజ్ బ్యాక్  డ్రాప్ లో వ‌చ్చే స‌న్నివేశాలు మెప్పిస్తాయ‌ని టాక్. అయితే చిక్కంతా ద్వితీయార్థంతోనేన‌ని అంటున్నారు. సెకాండాఫ్ లో ల్యాగ్ ఎక్కువ‌గా ఉంద‌ని ..బోరింగ్ స‌న్నివేశాలున్నాయ‌ని చెబుతున్నారు. 1980 కాలం నాటి వాతావ‌ర‌ణాన్ని తెర‌పైకి తీసుకురావ‌డంలో ద‌ర్శ‌కుడు ట్రై చేసినా.. ఆర్ట్ వ‌ర్క్ సోసోగానే ఉందిట‌. చాలా స‌న్నివేశాల్లో  రియాల్టీ మిస్ అయింద‌ని ఫిలిం న‌గ‌ర్ టాక్. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ నుంచి బిలో యావ‌రేజ్ గా నిలిచే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి అంతిమంగా ఎలాంటి  ఫ‌లితాలు సాధిస్తుందో ఇంకొన్ని గంట‌ల్లో తేలిపోనుంది. ఇందులో  జార్జిరెడ్డి పాత్ర‌లో సందీప్ (శాండీ) న‌టించాడు. ద‌ళం ఫేం జీవ‌న్ రెడ్డి తెర‌కెక్కించాడు.