సైరా మేకింగ్ ట్రీట్ కి గెట్ రెడీ

What is Sye Raa Controversy About?

ఫేస్ బుక్.. ట్విట్ట‌ర్.. ఇన్ స్టాగ్ర‌మ్ .. ఇలా అన్ని మాధ్య‌మాల్లో ప్ర‌వేశించిన రామ్ చ‌ర‌ణ్ ఇక‌పై మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి `సైరా-న‌ర‌సింహారెడ్డి` కి సంబంధించిన ప్ర‌తి అప్ డేట్ ని ఇక‌పై చ‌ర‌ణ్ సామాజిక మాధ్య‌మాల ద్వారా రివీల్ చేయ‌నున్నారు. ఇక చ‌ర‌ణ్ ఇటీవ‌లే ఇన్ స్టాగ్ర‌మ్ లో ప్ర‌వేశించారు కాబ‌ట్టి అక్క‌డ తొలిగా ఓ రెండు ఫోటోల్ని ట్వీట్ చేశారు. వాటికి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

తాజాగా చ‌ర‌ణ్ ఇన్ స్టాలో సైరా మేకింగ్ వీడియో ని రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే సైరా ప్యాక‌ప్ చెప్పేశారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్వింగులో ఉంది. అందుకే ప్ర‌చారంలో వేడి పెంచుతూ చ‌ర‌ణ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. సైరా టీజ‌ర్ ఇదివ‌ర‌కూ రిలీజై యూట్యూబ్ లో సునామీ స్పీడ్ తో దూసుకుపోయింది. ఈసారి మేకింగ్ వీడియో ఎలాంటి ఆస‌క్తిని క్రియేట్ చేయ‌బోతోంది? అన్న‌ది వేచి చూడాల్సిందే. సైరా అప్ డేట్స్ కోసం ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్స్ కోసం ఆస‌క్తిగా వేచి చూస్తున్న మెగా ఫ్యాన్స్ వీళ్ల ఆక‌లి తీరేలా వ‌రుస‌గా ట్రీట్ ఉంటుంద‌ట‌. చ‌ర‌ణ్ ఆ మేర‌కు ప్రిప‌రేష‌న్స్ చేస్తున్నార‌న్న‌ది శుభ‌వార్త‌నే.