అమ్మాయిలు వెంట‌ప‌డిన హీరో?

Last Updated on by

అమ్మాయిలు ఆయ‌న వెంట ఎందుకు ప‌డ‌తారు?… ఆయ‌న వెంటే ఎందుకు ప‌డ‌తారు? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం టాలీవుడ్ స్టార్ రైట‌ర్ బుర్రా సాయిమాధ‌వ్ చెప్పారు. అస‌లింత‌కీ బుర్రా చెప్పిన ఆయ‌న ఎవ‌రు? అంటారా? ఆయ‌నే లెజెండరీ న‌టుడు జెమిని గ‌ణేష‌న్‌. ఆయ‌న ఓర చూపు చూస్తే, కొంటె న‌వ్వు న‌వ్వితే ప‌డిపోని అమ్మాయి లేనే లేదు నాటి రోజుల్లో. అంత గొప్ప రొమాంటిక్ హీరోగా ఆయ‌న త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో వెలిగిపోయారు. అంతెందుకు సౌత్ స్టార్ హీరోయిన్ సావిత్రి .. ఆయ‌న న‌వ్వుకు ప‌డిపోయారు. ఆయ‌నలోని రొమాంటిక్ యాంగిల్‌కి ఫిదా అయిపోయారు.

వాస్తవానికి మ‌హాన‌టి సావిత్రిని పెళ్లి చేసుకున్న జెమిని గ‌ణేష‌న్ ఆ త‌ర‌వాత త‌న‌తో విభేధించి దూర‌మ‌య్యార‌ని, ఆ క్ర‌మంలోనే చివ‌రి రోజుల్లో సావిత్రి క‌ష్టాల పాల‌య్యార‌ని తెలుగు జ‌నం చెప్పుకుని, కోప్ప‌డ‌తారే కానీ, అస‌లు ఆయ‌న‌లోని అస‌లు కోణం మీలో ఎంద‌రికి తెలుసు? అంటూ నిలదీశారు బుర్రా. అయితే జెమిని గ‌ణేష‌న్‌తో సావిత్రి ప్రేమ‌లో ప‌డ‌డానికి స‌హేతుక కార‌ణం ఉందని, నాడు అమ్మాయిలంతా ఆయ‌న్ని ఎందుకు అంత‌గా ప్రేమించారో త‌న‌కు మాత్ర‌మే అర్థ‌మైంద‌ని, ఆ పాత్ర‌పై రీసెర్చ్ చేసిన ద‌ర్శ‌కుడు అశ్విన్ వ‌ల్ల త‌న కోపం త‌గ్గింద‌ని బుర్రా సాయిమాధ‌వ్ `మ‌హాన‌టి` పాట‌ల వేడుక‌లో చెప్ప‌డం విశేషం. సావిత్రి- జెమిని గ‌ణేష‌న్ జంటకు సంబంధించిన ఎన్నో తెలియ‌ని విష‌యాల్ని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌ను ప్రేమించ‌డ‌మే కాదు, ద్వేషిస్తార‌ని సాయిమాధ‌వ్ తెలిపారు. ఈ చిత్రానికి మాట‌లు అందించిన మేటి ర‌చ‌యిత‌గా ఆయ‌న ఎంతో ఉద్వేగంగా వేదిక‌పై మాట్టాడారు.

User Comments