గ్లోబరీనా టెక్నాలజీస్ ఆ మంత్రి ఫ్రెండ్ దా?

కార‌ణాలు ఏవైనా ఇంట‌ర్ బోర్డ్ నిర్వాకం తో 20 ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి. బోర్డు- తెలంగాణ ప్ర‌భుత్వం వైఫ‌ల్యానికి గ‌ల కార‌ణాలు క‌నుగొనే ప‌నిలో ప‌డింది. అయితే ప్ర‌భుత్వం వేసిన త్రిస‌భ్య క‌మిటీలో 60 వేల స‌మ‌స్య‌ల‌తు త‌లెత్తిన‌ట్లు తేలింది. విద్యార్ధుల మార్కుల మెమోల్లో త‌ప్ప‌లు దొర్ల‌డానికి కార‌ణం గ్లోబ‌రీనా టెక్సాల‌జీస్ ప్ర‌యివేట్ లిమిటెడ్ ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. గ్లోబరీనా టెక్నాలజీస్‌ సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో తొలి నుంచి సమస్యలు ఉత్ప‌న్నం అవుతున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా వెలుగులోకి వ‌చ్చింది. విద్యార్ధులు రుసుములు చెల్లించే నాటి నుంచే సాప్ట్ వేర్ లో స‌మ‌స్య‌లు త‌లెత్తిన‌ట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ విష‌యం గ్లోబ‌రీనా సంస్థ గ్ర‌హించినా నిమ్మ‌కు నిరెత్త‌న‌ట్లు వ్వ‌వ‌రించింది. దీనికి తోడు ఇంట‌ర్ బోర్డ్ ప్ర‌భుత్వ అధికారులు, ఉద్యోగులు కూడా ప‌ట్టించుకోలేద‌ని క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. అలాగే ప్ర‌భుత్వం నుంచి కాంట్రాక్ట్ ద‌క్కించుకున్న గ్లోబ‌రీన్ సంస్థ ఆది నుంచి ఏ ప‌ని స‌క్ర‌మంగా చేయ‌లేదని తేల్చారు.

ఎగ్జామినేష‌న్ ఫీజుల ద‌గ్గ‌ర నుంచి హాల్ టిక్కెట్లు మంజూరు చేయ‌డంలో, మార్కులు వివ‌రాలు పొందుప‌ర‌చ‌డంలో ప్ర‌తీ దానిలో గ్లోబ‌రీనా సంస్థ నిర్ల‌క్షం వ‌హించింది. దీన్ని ఇంట‌ర్ బోర్డ్ అధికారులు చూసి చూడ‌న‌ట్లు వ‌దిలేయ‌డం జ‌రిగింది. ఇన్ని విష‌యాలు అధికారులు తెలిసినా అదే సంస్థ‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ కొన‌సాగించ‌డం వెనుక కార‌ణం? ఏంటి? అన్న దానిపై వెబ్ మీడియాలో ఆస‌క్తిక‌ర రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ అధినేత తెలంగాణ మంత్రి, ముఖ్య‌మంత్రి త‌న‌యుడు కేటీఆర్ కు మంచి స్నేహితుడ‌ని, అత‌ని ఒత్తిడి కార‌ణంగానే స‌ద‌రు సంస్థ‌కు కాంట్రాక్ట్ ఇచ్చార‌ని, త‌ప్పులు దొర్లినా బోర్డ్ అధికారులు కూడా ఏమీ చేయ‌లేక మౌనంగా ఉన్నార‌నే కార‌ణాలు వినిపిస్తున్నాయి. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం ఎలా స్పందింస్తుందో? చూడాలి.