గొల్ల‌పూడి అంత్య‌క్రియ‌లు అక్క‌డే

సీనియ‌ర్ న‌టుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు భౌతికకాయాన్ని చెన్నైలోని ఆయన స్వగృహానికి తరలించారు. ప్రముఖుల, అభిమానులు సందర్శనార్థం గొల్లపూడి పార్థీవదేహాన్ని టీనగర్‌లోని ఆయన నివాసంలో ఉంచనున్నారు. గొల్లపూడి అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు కన్నమ్మపేట దహనవాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అదేరోజు ఉదయం టీనగర్‌ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు.

నేడు చెన్న‌య్ లోని గొల్ల‌పూడి ఇంటిని మెగాస్టార్ చిరంజీవి సంద‌ర్శించి ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. చిరుతో పాటు సుహాసిని ఇత‌ర తార‌లు గొల్ల‌పూడిని సంస్మ‌రించుకుని ఆయ‌న‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ గురువారం మ‌ధ్యాహ్నం చెన్న‌య్ లోని ఓ ప్ర‌యివేట్ ఆస్ప‌త్రిలో గొల్ల‌పూడి మృతి చెందారు. ఈ ఆదివారం ఆయ‌న‌కు అంత్య‌క్రియలు నిర్వ‌హించ‌నున్నారు. విజ‌య‌న‌గ‌ర వాసి అయిన గొల్ల‌పూడి మ‌ద్రాసు ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా ర‌చ‌యిత‌గా రాణించారు. ఆ క్ర‌మంలోనే ఆయ‌న చెన్న‌య్ లో స్థిర‌ప‌డ్డారు. విశాఖ న‌గ‌రంతోనూ ఆయ‌న‌కు గొప్ప అనుబంధం ఉంది.