వ‌ర‌స సినిమాలు నిర్మాత వివేక్

Last Updated on by

ఒక్క‌సారి ఒక సినిమా నిర్మించ‌డ‌మే క‌ష్టంగా మారుతున్న రోజులివి. కానీ వివేక్ కూచిబొట్ల మాత్రం ఒకేసారి అర‌డ‌జ‌న్ సినిమాల‌కు పైగా నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం తెలుగులో శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వంలో అడ‌వి శేష్ హీరోగా తెర‌కెక్కుతోన్న గూడాఛారి సినిమాకు స‌హ నిర్మాత‌గా ఉన్నాడు. ఈ చిత్రంతో పాటు బెల్లంకొండ శ్రీ‌నివాస్ సాక్ష్యం.. మంచు ల‌క్ష్మి వైఫ్ ఆఫ్ రామ్.. అల్ల‌రి న‌రేష్ భీమినేని శ్రీ‌నివాస‌రావ్ సినిమా.. అడవి శేష్, శివాని రాజ‌శేఖ‌ర్ జంట‌గా న‌టిస్తోన్న 2 స్టేట్స్ రీమేక్ సినిమాల‌కు కూడా స‌హ నిర్మాత‌గా ఉన్నాడు వివేక్ కూచిబొట్ల‌. ఇదిలా ఉండ‌గానే హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాజెక్ట్ కు కూడా తెర తీస్తున్నాడు. దాంతోపాటు క‌న్న‌డ‌లో రెండు సినిమాల‌ను నిర్మిస్తున్నాడు. అక్క‌డ అధ్య‌క్ష ఇన్ అమెరికా సినిమా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇక భోజ్ పురిలో కూడా ఓ సినిమాకు స‌హ నిర్మాత‌గా ఉన్నాడు ఈ నిర్మాత‌. వివేక్ నిర్మిస్తోన్న సినిమాల‌న్నీ విజ‌యవంతం అవ్వాల‌ని కోరుకుందాం..!

User Comments