168 లొకేషన్స్ లో గూఢ‌చారి

Last Updated on by

అక్కినేని స‌మంత గూఢ‌చ‌ర్య ం చేస్తోందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. అయితే ఈ గూఢ‌చ‌ర్య ం ఎవ‌రి కోసం అంటే టాలీవుడ్ యువ‌న‌టుడు అడివి శేష్ కోసం. అత‌డి సినిమా గూఢ‌చారి రిలీజ్‌కి రెడీ అవుతున్న వేళ సామ్ త‌న‌వంతుగా ప్ర‌మోష‌న‌ల్ సాయం చేస్తున్నారు. ఆడవి శేష్ హీరోగా శశికిరణ్ దర్శకత్వ ంలో తెర‌కెక్కిన‌ స్పై థ్రిల్లర్ ఆగష్టు 3న రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భ ంగా హైదరాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో స‌మంత స్వ‌యంగా ట్రైల‌ర్‌ని లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భాన సమంత మాట్లాడుతూ… టీజర్ చాలా బాగుంది. సినిమా హై బడ్జెట్ లో తీసినట్లు రిచ్ గా ఉంది. టీజర్ ను లాంచ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. క్షణం సినిమాలాగే ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అందరిలాగే ఈ సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నా అన్నారు.

అడవిశేష్ మాట్లాడుతూ…డైరెక్టర్ శశి ఈ సినిమాను గొప్పగా తెరకెక్కించార‌ని పొగిడేశారు. విజువల్స్ ఫీస్ట్ ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా న‌చ్చుతుంద‌న్నారు. 168 లొకేషన్స్ లో ఈ సినిమాను తీశారు. మంచి బడ్జెట్ ఇచ్చి మాకు సహకరించిన నిర్మాతలకు థాంక్స్. మా టీజర్ ను రిలీజ్ చేసిన సమంత కు స్పెషల్ థాంక్స్. ప్రేక్షకులను థ్రిల్ చెసే చిత్ర‌మిది.. అన్నారు. డైరెక్టర్ శశి మాట్లాడుతూ… సహకరించిన నిర్మాతలకు, టెక్నీషియన్స్ కు కృతజ్ఞతలు. సినిమా బాగా వచ్చింది. టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది అన్నారు. నిర్మాత అభిషేక్ నామ మాట్లాడుతూ – 160 డేస్ లో సినిమాను చిత్రీకరించాం. కథ, కథనాలు ప్రేక్ష‌కుల‌కు నచ్చే విధంగా ఉంటాయి. ఔట్‌పుట్‌ చూసాను. సినిమా బాగా వచ్చింది. సినిమాకు కావాల్సిన ప్రతిదీ శేష్ చూసుకున్నార‌ని అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ…

అడవి శేష్ కు ఈ సినిమా మైల్ స్టోన్ సినిమా అవుతుందని నమ్ముతున్నాను. గూఢచారి టీజర్ బాగుంది. చిత్ర యూనిట్ పడిన కష్టం టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. స‌క్సెస్ ఆశిస్తున్నాం. అన్నారు.

User Comments