గోపిచంద్ బ‌ల్ల‌గుద్దాడంటే

Last Updated on by

ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్ ఈసారి ప‌క్కా కాన్ఫిడెన్స్‌తో వ‌స్తున్నారు. అత‌డు న‌టించిన `పంతం` జూలై 5న రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయ స‌మావేశంలో గోపి కాస్త ఎమోష‌న‌ల్‌గానే మాట్లాడారు. ఈసారి ఎట్టిప‌రిస్థితిలో హిట్ కొడతాన‌న్న ధీమాని క‌న‌బ‌రిచారు. గోపిచంద్ – మెహ్రీన్ కౌర్ జంట‌గా చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో రాధామోహ‌న్ నిర్మించిన ఈ సినిమా త్వ‌ర‌లో రిలీజ్‌కి రానుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్‌లో మీడియాకి ట్రైల‌ర్‌, పాట‌ల్ని ప్ర‌ద‌ర్శించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ-“తొలుత చ‌క్రి కొత్త ద‌ర్శ‌కుడు అని సందేహించాను. కానీ రెండు మూడు సిట్టింగ్స్‌కే అత‌డి ప్ర‌తిభ ఎలాంటిదో అర్థ‌మైంది. ప్ర‌సాద్ మూరెళ్ల కెమెరా ప‌నిత‌నం పెద్ద ప్ల‌స్. త‌న‌తో రెండు మూడు సినిమాలు చేస్తాను. సురేంద‌ర్ రెడ్డి తెల్ల‌వారుఝాము 4 వ‌ర‌కూ షూటింగ్ చేసి మా వేడుక‌కు విచ్చేశారు. జూలై 5న రిలీజ్ చేస్తున్నాం.. ప్రేక్ష‌కాద‌ర‌ణ ఆశిస్తున్నాను.. అన్నారు. ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి మాట్లాడుతూ – ఆల్రెడీ పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ల‌కు ఆద‌ర‌ణ బావుంది. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా అన్నారు. సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ-“ టైటిల్ గోపీచంద్‌కి యాప్ట్ అనిపించింది. ట్రైల‌ర్‌లో తొలి డైలాగ్ కురుక్షేత్రం.. ఎంతో ఆక‌ట్టుకుంది. కోర్టులో చెప్పిన డైలాగ్ హైలైట్. గోపిచంద్ కెరీర్ పెద్ద హిట్ అవుతుంద‌ని కోరుకుంటున్నా. ప్ర‌సాద్ నాకు ఇష్ట‌మైన ఛాయాగ్రాహ‌కుడు. విజువల్స్ చాలా బావున్నాయి. నిర్మాత బాగా బడ్జెట్ పెట్టి క్వాలిటీతో తెర‌కెక్కించారు. మెహ్రీన్ మాట్లాడుతూ- ట్రైల‌ర్ వీక్షించాను. చాలా పాజిటివ్ టాక్ వ‌చ్చింది. జూలై 5 రిలీజ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి“ అన్నారు.

గోపిచంద్ మాట్లాడుతూ “ప‌రిశ్ర‌మ‌లో ఎంతో ఇష్ట‌మైన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి నా ట్ర‌ల‌ర్ లాంచ్ చేయ‌డం చాలా సంతోషాన్నిచ్చింది. తెల్ల‌వారు 4ఏఎం వ‌ర‌కూ ప‌ని చేసి మాకోసం ప్ర‌చారానికి వ‌చ్చారు. నేను క‌థ‌ను న‌మ్మి చేసినందుకు చ‌క్రి బాగా చేశాడు. క‌థ ఎంత బాగా చెప్పాడో తీయ‌డం అంతే బాగా చేశాడు. రాధామోహ‌న్ అంతే బాగా చేశాడు. సామాజిక ప‌ర్స‌స్ ఉన్న సినిమా. టీజ‌ర్‌, పాట‌ల‌కు స్ప ంద‌న బావుంది. ట్రైల‌ర్‌కి స్ప ంద‌న బావుంది. హిట్ట‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.. అన్నారు

User Comments