పంతంతో తాడో పేడో

Last Updated on by

కండ‌ల హీరోల జాబితా తిర‌గేస్తే అందులో టాప్ 5లో గోపిచంద్ పేరు ఉంటుంది. చొక్కా విప్పి రొమ్ములు విరుచుని విల‌న్ల‌ను చిత‌క్కొట్టే హీరోగా అత‌డికంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. గోపి మ్యాన‌రిజ‌మ్‌కి, మాస్ అప్పీల్‌కి వీరాభిమానులున్నారు. అందుకే ఇటీవ‌ల కెరీర్ డైలెమాలో ఉన్నా.. వ‌రుస‌గా సినిమాల్లో మాత్రం న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు పంతం చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాతో తాడో పేడో తేల్చుకోవాల్సిన స‌న్నివేశ‌మే ఉంది. వ‌చ్చే వారంలోనే ఈ సినిమా రిలీజ‌వుతోంది. ఆ క్ర‌మంలోనే ప్ర‌చారంలో వేగం పెంచింది టీమ్‌. చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై ఈ చిత్రం తెర‌కెక్కింది.

హైద‌రాబాద్ నుంచి బెజ‌వాడ వ‌రకూ.. బెజ‌వాడ టు తిరుప‌తి `పంతం` ప్ర‌చారం గొప్ప‌గానే సాగించేందుకు ప్ర‌ణాళిక‌లు ఉన్నాయి. ఇదివ‌ర‌కూ బెజ‌వాడ ప్ర‌చారం అద‌ర‌గొట్టేసిన టీమ్ ఈనెల 30న హైద‌రాబాద్ ప్ర‌చారాన్ని పీక్స్ లో చేస్తోందిట‌. హైద‌రాబాద్ గ‌చ్చిబౌళి లో సంధ్య క‌న్వెన్ష‌న్‌లో ఘ‌నంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు. నాలుగు లారీల్లో గోపిచంద్ అభిమానుల్ని వేదిక వ‌ద్ద దించి ర‌చ్చ ర‌చ్చ చేసేందుకు స‌న్నాహాలు సాగుతున్నాయ‌ని తెలిసింది. మొత్తానికి గోపి తాడో పేడో తేల్చుకోవాల్సిన వేళ ఘ‌న‌మైన ఏర్పాట్ల‌లోనే ఉన్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. కొడ్తే కుంభం క‌దిలిపోవాలి గోపీ!

User Comments