తెలుగ‌మ్మాయిపై కుట్ర‌!

ఉవ్వెత్తున ఎగ‌సిప‌డిన ఓ తెలుగ‌మ్మాయి కెరీర్ ఉన్న‌ట్టుండి డోలాయ‌మానంలో ప‌డ‌డంపై ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ న‌డుస్తోంది. స‌రిప‌డినంత ట్యాలెంటు ఉన్నా.. స‌ద‌రు తెలుగ‌మ్మాయ్ ప్ర‌స్తుతం అర‌కొర అవ‌కాశాల‌తోనే ఎందుకు రేసులో వెన‌క‌బ‌డిన‌ట్టు? కెరీర్‌లో హిట్లు ఉన్నా, కొన్ని ప‌రాజ‌యాలు అమ్మ‌డిని వెన‌క్కి లాగేశాయా? లేక కుహానా క‌మిట్‌మెంట్ వ్య‌వ‌హార‌మే ఇందుకు కార‌ణ‌మైందా? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కీ ఎవ‌రా అమ్మాయి? అంటే.. ద‌ర్శ‌కుడు తేజ ప‌రిచ‌యం చేసిన స‌ద‌రు తెలుగ‌మ్మాయ్‌.. హార‌ర్ సినిమాతో బంప‌ర్‌హిట్ కొట్టింది. ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ‌లోనూ న‌టించింది.

కెరీర్ ఆరంభ‌మే రెండో సినిమానే బంప‌ర్ హిట్‌. ఆ సినిమా 30కోట్ల వ‌సూళ్లు తేవ‌డం వెన‌క ఆ ప్ర‌తిభావ‌ని న‌ట‌నే కార‌ణ‌మ‌ని ప్ర‌శంసించింది ట్రేడ్‌. అంత గ్రేట్ ట్యాలెంట్ ఉండీ స‌ద‌రు తెలుగ‌మ్మాయ్ రేసులో ఎందుకు వెన‌క‌బ‌డింది? క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్య‌మా? లేక క‌మిట్‌మెంట్‌కి అంగీక‌రించ‌క‌పోవ‌డ‌మా? అని ప్ర‌శ్నిస్తే, ఓ సీనియ‌ర్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ చెప్పిన వివ‌రం ప్ర‌కారం.. త‌న‌పై లేనిపోని దుష్ప్ర‌చారం సాగించారు కొంద‌రు. స‌ద‌రు తెలుగమ్మాయికి క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌ని, టైమ్‌కి సెట్స్‌కి రాద‌ని, అందువ‌ల్ల‌నే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వెక్స్ అయిపోయార‌ని ప్ర‌చారం సాగించారు. అది త‌న కెరీర్‌కి కొంత‌వ‌ర‌కూ మైన‌స్ అయ్యింది. అయితే వాస్త‌వం మాత్రం వేరొక‌లా ఉంద‌ని ప్ర‌త్య‌క్షంగా చూసిన‌ స‌ద‌రు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ చెబుతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి టైమ్ అంటే టైమే. స‌రిగ్గా లొకేష‌న్‌లో ఉద‌యం 7గంట‌ల‌కే ఉండాలంటే ఆ టైమ్‌కి ముందే వ‌చ్చేస్తోంది. కాల్షీట్ అయిపోయాక కూడా వేచి చూస్తోంది. షాట్ రెడీ అన‌కుండానే అసిస్టెంట్ల‌కు అందుబాటులో ఉంటూ స‌హ‌క‌రిస్తోంది. ఇన్ని మంచి ల‌క్ష‌ణాలు ఉన్న అమ్మాయి ఇంత‌కుముందు అలా చేసిందంటే న‌మ్మ‌లేం అంటూ చెప్పుకొచ్చాడు అత‌డు. అంటే దీనిని బ‌ట్టి క‌మిల్‌మెంట్ ఉంటే ఒక‌లా? ఇవ్వ‌క‌పోతే ఇంకోలా ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు దుష్టులు ట్రీట్ చేస్తార‌ని అర్థం చేసుకోవాలి. ప్ర‌స్తుతం స‌ద‌రు తెలుగ‌మ్మాయ్ ఓ హార‌ర్ చిత్రంలో నటిస్తోంది. ఇది హిట్ట‌యితే మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయేమో చూడాలి.