అవ‌తార్ డైరెక్ట‌ర్ కే గోవింద స‌ల‌హాలు

జేమ్స్  కెమెరూన్ తెర‌కెక్కించిన అవ‌తార్ అద్భుతం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ వ‌సూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకు ఎక్కింది. ఇటీవ‌లే ఆ రికార్డును అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ తిర‌గ‌రాసింది.దీంతో అవ‌తార్ స్థానం ఇప్పుడు రెండ‌వ‌ది. అయితే అవ‌తార్ సినిమా గురించి బాలీవుడ్ న‌టుడు గోవింద ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసాడు.

అవ‌తార్ టైటిల్ త‌నే ఇచ్చాడుట‌. సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని జేమ్స్ కెమెరూన్ కే ముందే చెప్పాడుట‌. సినిమా పూర్తిచేయ‌డానికి ఏడేళ్లు స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పాడుట‌. ఆ మాట‌కు జేమ్స్ కు కోపం వ‌చ్చిందిట‌.అంత స‌మ‌యం ప‌డుతుంద‌ని క‌చ్చితంగా ఎలా చెబుతున్నావ‌ని జేమ్స్ ప్ర‌శ్నించాడుట‌. అలాగే అవ‌తార్ లో న‌టించ‌మ‌ని గోవింద‌ని జేమ్స్ అడిగారుట‌. కావాల్సినంత డ‌బ్బు ఇస్తాన‌న్నారుట‌. కానీ గోవింద నా వ‌ల్ల కాద‌ని చెప్పాడుట‌. శ‌రీర‌మంతా రంగులు పూసుకుని న‌టించ‌డం త‌న వ‌ల్ల కాద‌ని, అలా న‌టిచ‌డం త‌న‌కు ఏ మాత్రం ఇష్టం లేద‌ని కామెరూన్ కి నిర్మోహ‌మాటంగా చెప్పేసాడుట‌. ఈ వ్యాఖ్య‌లపై ,సోష‌ల్ మీడియాలో గోవింద‌పై నేటి జ‌నులు సెటైర్లు వేస్తున్నారు.