హంసవా.. గులాబీవా?

గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్ స‌ర్కిల్స్ నుంచి మిస్స‌య్యింది. కానీ సామాజిక మాధ్య‌మాల్లో చిక్కుకుంది. అక్క‌డ ఫోటోల‌తో వేడెక్కిస్తోంది. ఎవ‌రీ భామ .. అంటే హంసా నందిని అని ఫ్యాన్స్ ఇట్టే చెప్పేస్తారు..
మరాఠా కుటుంబం నుండి వచ్చిన‌ హంసా నందిని అసలు పేరు పూనం. అనుమానాస్పదం సినిమా సమయంలో దర్శకుడు వంశీ హంసా నందినిగా మార్చారు. 2014లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రక సినిమా రుద్రమదేవి సినిమాలో మదనిక పాత్రలో కనిపించింది. హంసా నందిని పూణే నుంచి మోడలింగ్ చేయడంకోసం ముంబైకి వచ్చింది. 2002 నుంచి మోడలింగ్ రంగంలో ఉంటూ, పలు టెలివిజన్ ప్రకటనలలో నటించింది. 2013 లో మిర్చి, భాయి, అత్తారింటికి దారేది మరియు రామయ్యా వస్తావయ్యా , బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలలో ప్రత్యేక గీతాలలో నటించింది. నాగార్జున, జ‌గ‌ప‌తిబాబు సినిమాల్లోనూ న‌టించింది. గ‌త కొంత‌కాలంగా ఈ బ్యూటీ టాలీవుడ్ స‌ర్కిల్స్ నుంచి మిస్స‌య్యింది. తాజాగా సామాజిక మాధ్య‌మాల్లో కొత్త ఫోటోషూట్ తో మ‌రోసారి ట‌చ్ లోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.